
అమరావతి, ఏప్రిల్ 23: రాష్ట్ర పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు బుధవారం (ఏప్రిల్ 23) విడుదల అయ్యాయి. బుధవారం ఉదయం 10 గంటలకు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యూకేషన్ ఆంధ్రప్రదేశ్ (BSEAP) విడుదల చేసింది. 2024-25 విద్యా సంవత్సరానికిగానూ మార్చి 17 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరగగా రాష్ట్ర వ్యాప్తంగా 6,19,275 మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షలు రాశారు. వీరిలో ఇంగ్లిష్ మీడియంకులో 5,64,064 మంది, తెలుగు మీడియంలో 51,069 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. అనంతరం ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 9వ తేదీ వరకు కేవలం ఏడు రోజుల్లో పదో తరగతి పబ్లిక్ పరీక్ష మూల్యాంకనం ముగించి త్వరిత గతిన ఫలితాల విడుదలకు ఏర్పాట్లు చేశారు. ఫలితాల వెల్లడి అనంతరం అధికారిక వెబ్‌సైట్‌తోపాటు టీవీ9 తెలుగు వెబ్‌సైట్‌లోనూ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు..
అనుకున్న ఫలితాలు రాలేదనీ, ఫెయిల్ అయ్యామని.. తొందరపడి ప్రాణాలు తీసుకోవాలనే నిర్ణయానికి ఎవరూ రావొద్దు. తాజాగా విడుదలైన టెన్త్ ఫలితాలు జీవితంలో ఒక భాగం మాత్రమే. అవే జీవితం కాదు. సప్లిమెంటరీ పరీక్షలు రాయండి. తప్పక పాస్ అవుతారు. అసలు చదువే ఇష్టంలేకపోతే నచ్చిన పని చేయండి. అంతేగానీ.. అర్ధాంతరంగా ప్రాణాలొదిలేస్తే.. మీ పైనే ప్రాణాలు పెట్టుకున్న మీ కన్నోళ్ల గుండె పగులుతుంది. ఓసారి ఆలోచించరూ..
2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పరీక్షలకు మొత్తం 6,14,459 మంది విద్యార్థులు హాజరుకాగా.. వారిలో 4,98,585 మంది పాసైనట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు.
ఈ రోజు విడుదలైన పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో కాకినాడకు చెందిన నేహాంజని అనే బాలికకు 600కు 600 మార్కులు వచ్చాయి.
పల్నాడు జిల్లాలో ఒప్పిచర్ల జడ్పీ హైస్కూల్‌లో చదువుతున్న పావని చంద్రిక అనే విద్యార్థినికి ఏకంగా 598 మార్కులు వచ్చాయి. ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్ధిని ఈ ఘనత సాధించడం విశేషం.
గత ఐదేళ్లలో 2022లో అతితక్కువగా 67.26 శాతం ఉత్తీర్ణత నమోదుకాగా.. అత్యధికంగా ఈ ఏడాదే (2025) ఏకంగా 81.14 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
రీకౌంటిగ్, రీవెరిఫికేషన్‌కు ఏప్రిల్ 24 ఉదయం 10 గంటల నుంచి మే 1 రాత్రి 11 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రీకౌంటింగ్‌కు ఒక్కో సబ్జెక్టుకు రూ.500, రీ వెరిఫికేషన్కు రూ.1000 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది.
ఏపీ పదో తరగతి 2025 పబ్లిక్ పరీక్షల ఫలితాలు
ఫస్ట్ డివిజన్‌లో 65.36 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత,
సెకండ్ డివిజన్‌లో 10.69 శాతం,
థర్డ్ డివిజన్‌లో 5.09 శాతం ఉత్తీర్ణత
అల్లూరి సీతారామరాజు జిల్లా రాష్ట్రంలోనే అతి తక్కువ ఉత్తీర్ణత 47.64 శాతం నమోదు చేసింది.
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 19, 2025వ తేదీ నుంచి మే 28 వ తేదీ వరకు జరుగుతాయి.
పదో తరగతి ఫలితాల్లో 81.14 శాతం మంది ఉత్తీర్ణత పొందారు. మొత్తం విద్యార్ధుల్లో ఫస్ట్ డివిజన్‌లో 65.36%, సెకండ్ డివిజన్‌లో 10.69%, థార్డ్ డివిజన్‌లో 5.09% ఉత్తీర్ణత పొందారు.
1680 స్కూళ్లలో వంద శాతం ఉత్తీర్ణత. 19 స్కూళ్లలో సున్నా శాతం ఉత్తీర్ణత. పార్వతీపురం మన్యం జిల్లాలో అత్యధికంగా 93.90 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
పదో తరగతి ఫలితాల్లో 81.14 శాతం మంది ఉత్తీర్ణత పొందారు. వీరిలో అబ్బాయిలు 78.31 శాతం, అమ్మాయిలు 84.09 శాతం ఉత్తీర్ణత పొందారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్ధులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు 2025 మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా విడుదల చేశారు.
ఏపీ పదో తరగతి పరీక్ష ఫలితాలు ఉదయం పది గంటలకు మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా ఈ రోజు ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. ఫలితాలను టీవీ9 తెలుగులో వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోండి.
ఈ ఏడాది మార్చి 17 నుంచి మార్చి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా 3,450 పరీక్షా కేంద్రాల్లో టెన్త్ పబ్లిక్ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 6,19,275 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 3,17,939 మంది బాలురు, 3,05,153 మంది బాలికలు ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్ ఫలితాలను కూడా ఈ రోజు మంత్రి నారా లోకేష్ విడుదల చేయనున్నారు. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ https://apopenschool.ap.gov.in/ లింక్ లో చెక్ చేసుకోవచ్చు. సార్వత్రిక పరీక్షలు 30,334 మంది విద్యార్ధులు రాశారు.
మన మిత్ర వాట్సప్ నంబర్ 9552300009కు ‘Hi’ అని మెసేజ్ చేసి, విద్యా సేవల ఆప్షన్ ఎంచుకున్న తర్వాత పదో తరగతి పరీక్షల ఫలితాల ఆప్షన్ వస్తుంది. అందులో హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేస్తే చాలు.. ఫలితాలను పీడీఎఫ్ కాపీ రూపంలో క్షణాల్లో పొందవచ్చు.
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు 2025 అధికారిక వెబ్‌సైట్ https://bse.ap.gov.in/తో పాటు టీవీ9 తెలుగు వెబ్‌సైట్ https://tv9telugu.com/లోనూ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.