AP RGUKT IIIT Admissions 2025: ఏపీ ట్రిపుల్ ఐటీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల.. టెన్త్‌ అర్హతతో బీటెక్‌లో అడ్మిషన్

రాష్ట్రంలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లలో 2025-26 విద్యాసంవత్సారానికి సంబంధించి ఆరేళ్ల బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ రాజీవ్‌గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పదో తరగతి పాసైన విద్యార్ధులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు..

AP RGUKT IIIT Admissions 2025: ఏపీ ట్రిపుల్ ఐటీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల.. టెన్త్‌ అర్హతతో బీటెక్‌లో అడ్మిషన్
AP RGUKT IIIT Admissions

Updated on: May 14, 2025 | 6:18 AM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్‌ ఐటీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్‌ రాజీవ్‌గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పదో తరగతి మార్కుల ఆధారంగా 6 ఏళ్ల బీటెక్ కోర్సులో నేరుగా ప్రవేశాలు కల్పించనున్నారు. ఆసక్తి కలిగిన విద్యార్ధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఏపీలో IIIT క్యాంపస్‌లు ఇవే..

  • నూజివీడు (ఏలూరు జిల్లా)
  • ఆర్కే వ్యాలీ (ఇడుపులపాయ, వైఎస్ఆర్ జిల్లా)
  • ఒంగోలు (ప్రకాశం జిల్లా)
  • శ్రీకాకుళం (శ్రీకాకుళం జిల్లా)

ఆన్‌లైన్ దరఖాస్తు ఏప్రిల్ 27 ఉదయం 10:00 గంటల నుంచి ప్రారంభమైనాయి. ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ మే 20, 2025 సాయంత్రం 5 గంటలుగా నిర్ణయించారు. దరఖాస్తు రుసుము కింద జనరల్ అభ్యర్థులు రూ.300, రిజర్వేషన్‌ వర్గాలు రూ. 200, ఇతర రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు రూ.1000 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఎలాంటి రాత పరీక్షలేకుండానే రిజర్వేషన్ విధానాలను అనుసరించి పదో తరగతిలో మెరిట్, ప్రతి అర్హత సబ్జెక్టులో పొందిన మార్కుల ఆధారంగా అడ్మిషన్లు ఉంటాయి. ఒక్కో క్యాంపస్‌లో 1000 సీట్లు, అదనంగా ఈడబ్ల్యూఎస్‌ సీట్లు మరో 100 అందుబాటులో ఉన్నాయి. మొత్తం 4 క్యాంపస్‌లలో కలిపి 4,400 వరకు సీట్లు అందుబాటులో ఉన్నాయి. కౌన్సెలింగ్‌ అనంతరం జూన్‌ 30వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.

దరఖాస్తు చేసుకోవడానికి వెబ్‌సైట్ లింక్‌పై చేయండి లేదా AP ఆన్‌లైన్ కేంద్రాల ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

ముఖ్యమైన తేదీలు..

  • ఏపీ ఐఐఐటీ నోటిఫికేషన్ విడుదల: ఏప్రిల్ 24, 2025.
  • ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: మే 20, 2025 (సాయంత్రం 5 గంటల వరకు)
  • ఎంపికైన విద్యార్థుల జాబితా ప్రకటన తేదీ: జూన్ 5, 2025.
  • సర్టిఫికెట్ వెరిఫికేషన్, కౌన్సెలింగ్‌ తేదీ: జూన్ 11, 2025 నుంచి ప్రారంభం

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.