AP Lawcet 2025 Result date: ఏపీ లాసెట్‌ 2025 ఫలితాల విడుదల తేదీ వచ్చేసింది.. ఎప్పుడో తెలుసా?

రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి లా కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (ఏపీ లాసెట్‌ & పీజీఎల్‌సెట్‌)-2025 పరీక్షలు జూన్‌ 5వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీ తాజాగా విడుదలైంది. ఆన్సర్‌ కీతో పాటు రెస్పాన్స్‌షీట్‌, మాస్టర్‌ ప్రశ్నపత్రంలను..

AP Lawcet 2025 Result date: ఏపీ లాసెట్‌ 2025 ఫలితాల విడుదల తేదీ వచ్చేసింది.. ఎప్పుడో తెలుసా?
Andhra Pradesh Lawcet

Updated on: Jun 07, 2025 | 5:33 PM

అమరావతి, జూన్‌ 7: ఆంధ్రప్రదేశ్‌ లా కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (ఏపీ లాసెట్‌ & పీజీఎల్‌సెట్‌)-2025 పరీక్షలు జూన్‌ 5వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీ తాజాగా విడుదలైంది. ఆన్సర్‌ కీతో పాటు రెస్పాన్స్‌షీట్‌, మాస్టర్‌ ప్రశ్నపత్రంలను అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. ఆన్సర్‌ కీపై అభ్యంతారాలను జూన్‌7, 8వ తేదీల్లో అవకాశం కల్పించినట్లు తెలిపారు. అభ్యంతరాల స్వీకరణ అనంతరం తుది ఆన్సర్ కీ రూపొందించి ఫలితాలు విడుదల చేస్తామని తెలిపారు.

కాగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లా కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి లా కోర్సుల్లో ప్రవేశాలకు శ్రీపద్మావతి మహిళా యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ ఏడాది లా సెట్‌ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. జూన్‌ 5న ఏపీ లాసెట్‌-2025ను ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించగా.. పరీక్షకు మొత్తం 27,253 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇక జూన్‌ 16న ఫైనల్‌ కీ విడుదల చేసి, అనంతరం జూన్‌ 22వ తేదీన తుది ఫలితాలు వెల్లడించనున్నారు.

ఏపీ లాసెట్‌ 2025 ప్రాథమిక కీ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

ఏపీపీఎస్సీ ఎఫ్‌ఆర్‌ఓ ప్రాథమిక కీ విడుదల.. జూన్ 11 వరకు అభ్యంతరాల స్వీకరణ

ఆంధ్రప్రదేశ్‌ ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ (FRO) మెయిన్స్‌ పరీక్ష ప్రాథమిక ఆన్సర్‌ కీ తాజాగా విడుదలైంది. ఈ మేరకు పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రాల కీని వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు ఏపీ పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ (ఏపీపీఎస్సీ) ప్రకటన జారీ చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ https://psc.ap.gov.in/ నుంచి ప్రాథమిక ఆన్సర్‌ కీ ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఆన్సర్‌ కీపై జూన్‌ 9 నుంచి 11 వరకు అభ్యంతరాలు స్వీకరించి, అనంతరం తుది కీ, ఫలితాలు విడుదల చేస్తారు. కాగా జూన్‌ 2 నుంచి 4వ తేదీ వరకు ఏపీపీఎస్సీ ఎఫ్‌ఆర్‌ఓ మెయిన్స్‌ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తం 37 ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి ఈ నియామక ప్రక్రియ కొనసాగుతుంది.

ఏపీపీఎస్సీ ఎఫ్‌ఆర్‌ఓ ప్రాథమిక కీ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.