AP Inter Results 2025 Today: ఇంటర్ విద్యార్ధులకు అలర్ట్.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్‌ ఇదే

రాష్ట్ర వ్యాప్తంగా 2024-25 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండియర్‌ వార్షిక పరీక్షలు రాసి.. ఫలితాల కోసం ఎప్పుడెప్పుడాని ఉత్కంఠగా ఎదురు చూస్తున్న విద్యార్ధులకు ఇంటర్ బోర్డు కీలక అప్ డేట్ జారీ చేసింది. శనివారం (ఏప్రిల్ 12) ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్నట్లు వెల్లడించింది..

AP Inter Results 2025 Today: ఇంటర్ విద్యార్ధులకు అలర్ట్.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్‌ ఇదే
AP Inter Results 2025

Updated on: Apr 13, 2025 | 1:48 PM

అమరావతి, ఏప్రిల్ 11: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండియర్‌ వార్షిక పరీక్షలు రాసిన విద్యార్దులకు అలర్ట్.. ఫలితాలు మరికాసేపట్లో విడుదలకానున్నాయి. ఈ మేరకు ఇంటర్‌ బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. శనివారం (ఏప్రిల్ 12) ఉదయం 11 గంటలకు ఇంటర్ రెండు సంవత్సరాల ఫలితాలు వెల్లడించనున్నారు. ఫలితాలు విడుదలైన తర్వాత విద్యార్ధులు ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌తోపాటు టీవీ9 తెలుగు వెబ్‌సైట్‌లో కూడా ఫలితాలను నేరుగా చెక్‌ చేసుకోవచ్చు. అలాగే మన మిత్ర వాట్స్ యాప్ నంబర్‌ 9552300009కు ‘hi’ అని మెసేజ్‌పెట్టి కూడా ఫలితాలు సులువుగా తెలుసుకోవచ్చు.

కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ రెగ్యులర్‌, ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ ఇంటర్‌ పరీక్షలు 26 జిల్లాల్లో మొత్తం 1535 కేంద్రాల్లో దాదాపు 10,58,892 మంది విద్యార్ధులు ఇంటర్ ఫస్ట్, సెకండ్‌ ఇయర్‌ పరీక్షలు రాశారు. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు రెగ్యులర్‌ ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగాయి. ఇందులో మార్చి 1 నుంచి 19 వరకు ఫస్ట్‌ ఇయర్‌, మార్చి 3 నుంచి 20 వరకు సెకండ్ ఇయర్‌ పరీక్షలు జరిగాయి. ఇక ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ ఇంటర్‌ పరీక్షలు మార్చి 3 నుంచి 15 వరకు జరిగాయి. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించారు. పరీక్షలు పూర్తైన కేవలం 20 రోజుల్లోనే మూల్యాంకనం ప్రక్రియ పూర్తి చేసిన ఇంటర్ బోర్డు ఫలితాల విడుదలకు రంగం సిద్ధం చేసింది.

ఇవి కూడా చదవండి

మరోవైపు ఇంటర్ ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షలు రాసిన విద్యార్ధులకు సెకండియర్ క్లాసులు ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమైనాయి. వీరికి ఏప్రిల్ 23వ తేదీ వరకు ప్రత్యేకంగా బ్రిడ్జి కోర్సు నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత ఏప్రిల్ 24వ తేదీ నుంచి జూనియర్ కాలేజీలతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూళ్లకు వేసవి సెలవులు మంజూరు చేస్తారు. ఇక జూన్ 12వ తేదీన తిరిగి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.