AP Inter Exams: ఏపీలో ఇంటర్ పరీక్షలు వాయిదా పడే అవకాశం.. నేడు ఇంటర్ బోర్డు అధికారులు, ఎస్సెస్సీ బోర్డు సమావేశం

|

Mar 02, 2022 | 7:45 AM

AP Inter Exams: ఆంధ్రప్రదేశ్(Andhpradesh) లోని ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు(Inter Public Exams) వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఏపీ ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఇంటర్ పరీక్షలు..

AP Inter Exams: ఏపీలో ఇంటర్ పరీక్షలు వాయిదా పడే అవకాశం.. నేడు ఇంటర్ బోర్డు అధికారులు, ఎస్సెస్సీ బోర్డు సమావేశం
Follow us on

AP Inter Exams: ఆంధ్రప్రదేశ్(Andhpradesh) లోని ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు(Inter Public Exams) వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఏపీ ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఇంటర్ పరీక్షలు ఏప్రిల్ 8వ తేదీ నుంచి ప్రారంభం కావాల్సి ఉంటుంది. అయితే నిన్న విడుదల చేసిన జేఈఈ మెయిన్‌ పరీక్షల షెడ్యూల్ ను జాతీయ పరీక్షల మండలి (NTA) విడుదల చేసింది.  జేఈఈ మెయిన్‌ పరీక్షలు .. ఏపీలో ఇంటర్ పరీక్షలు ఒకే రోజు ఉండడంతో.. ఏపీలో ఇంటర్ పరీక్షల నిర్వహణకు కొత్త తేదీపై అధికారులు పునరాలోచిస్తున్నారు. ఒకవేళ ఇంటర్ పరీక్షలు వాయిదా పడితే ఆ ప్రభావం పదోతరగతి పరీక్షలపై పడుతుంది. ఈ నేపథ్యంలో ఎస్సెస్సీ బోర్డు, ఇంటర్‌ విద్యామండలి అధికారులు బుధవారం ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. వివరాల్లోకి  వెళ్తే..

ఆంధప్రదేశ్ లోని ఇంటర్ పరీక్షలు ఏప్రిల్‌ 8వ తేదీన ప్రారంభమై.. 28వ తేదీతో పూర్తి కానున్నాయి. ఇక జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు కూడా ఏప్రిల్‌ 16 వ తేదీ నుంచి ఏప్రిల్ 21వ తేదీ వరకు జరగనున్నాయి. దీంతో ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థులు జేఈఈ రాసేందుకు వీలు కాదు. దీంతో ఇంటర్ పరీక్షల నిర్వహణపై ఇంటర్ బోర్డు అధికారులు పలు రకాలుగా ఆలోచనలు చేస్తున్నారు.

ఇంటర్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకూ జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 16వ తేదీన ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథమెటిక్స్‌- 2ఏ , బోటనీ , సివిక్స్‌ పరీక్షలు జరగనుండగా.. ఏప్రిల్ 19 తేదీన ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథమెటిక్స్‌ – 2బి , జువాలజీ , హిస్టరీ పరీక్షలు జరగనున్నాయి.

జేఈఈ మెయిన్‌ పరీక్షలు రెండు విడతలుగా ఉదయం, మధ్యాహ్నం నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు.. మొదటి విడతగా.. రెండవ విడతగా సాయంత్రం 3 గంటల నుంచి 6 గంటల వరకు నిర్వహించనున్నారు.

దీంతో రెండు పరీక్షల ఒకేసారి జరగనుండడంతో ఇంటర్ రాసే విద్యార్థులు జేఈఈ పరీక్షలను రాసేందుకు వీలుండదు. కనుక ఏపీలోని ఇంటర్ పరీక్షలను మొత్తం షెడ్యూల్ ను మార్చడమా.. లేక జెఈఈ పరీక్షల సమయంలో ఉన్న ఇంటర్ పరీక్షలను వాయిదా వేస్తె సరిపోతుందా.. లేక ఇంటర్ ఫస్ట్ ఎగ్జామ్స్ ను యధావిధిగా నిర్వహించి సెకండ్ ఇయర్ వాయిదా వేస్తె సరిపోతుందా..  అనే ఆలోచనలో ఇంటర్ బోర్డు అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది.  అయితే ఇంటర్ పరీక్షలు వాయిదా పడితే.. దాని ప్రభావం టెన్త్ పరీక్షలపై కూడా పడనుంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఇంటర్‌ విద్యామండలి అధికారులు, ఎస్సెసీ బోర్డు ప్రత్యేక సమావేశం కానున్నారు. పరీక్షల నిర్వహణ విషయంపై సమాలోచన చేయనున్నారు.

ఇంటర్‌ పరీక్షలు ఉదయం 9 నుంచి 12 వరకు ఉంటాయి. ఈ నేపథ్యంలో ఇంటర్‌ పరీక్షలను మొత్తం వాయిదా వేయాలా? లేదా… ఒకే తేదీన ఉన్న పరీక్షలను వాయిదా వేస్తే సరిపోతుందా? అనే దానిపైనా అధికారులు ఆలోచనలు చేస్తున్నారు. ఇంటర్‌ మొదటి ఏడాది పరీక్షలను యథావిధిగా కొనసాగించి, రెండో ఏడాది వాయిదా వేస్తే ఎలా అనే దానిపైనా సమాలోచనలు జరుపుతున్నారు.

Also Read:

రేపు జరగాల్సిన ఏపీ రాష్ట్ర కేబినెట్ మీటింగ్ వాయిదా.. ప్రకటించిన తేదీకే అసెంబ్లీ సమావేశాలు