APPSC Group 1, 2 Notifications: ఏపీపీఎస్సీ గ్రూప్-1, 2 కింద భర్తీ చేసే పోస్టులు ఇవే.. నెల రోజుల్లోనే నోటిఫికేషన్లు
రాష్ట్ర నిరుద్యోగులకు జగన్ సర్కార్ తీపి కబురు చెప్పింది. 597 గ్రూప్-1, 2 పోస్టుల భర్తీకి అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్లు త్వరలో విడుదలకానున్నాయి. గ్రూప్-1 కింద 89 పోస్టులు, గ్రూప్-2 కింద 508 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ..
అమరావతి, ఆగస్టు 30: రాష్ట్ర నిరుద్యోగులకు జగన్ సర్కార్ తీపి కబురు చెప్పింది. 597 గ్రూప్-1, 2 పోస్టుల భర్తీకి అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్లు త్వరలో విడుదలకానున్నాయి. గ్రూప్-1 కింద 89 పోస్టులు, గ్రూప్-2 కింద 508 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఆగస్టు 28న ఉత్తర్వులు జారీ చేసింది. గ్రూప్-1 విభాగంలో రెవెన్యూ, బీసీ వెల్ఫేర్, ఆర్థిక, మున్సిపల్, ట్రెజరీ, ప్రొహిబిషన్, రవాణా, సాంఘిక శాఖలతో సహా ఇతర శాఖల్లో నియామకాలను భర్తీ చేయనున్నారు. మరో నెల రోజుల్లో ఇందుకు సంబంధించి నోటిఫికేషన్లు కూడా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) విడుదల చేయనుంది. మరో వైపు ప్రభుత్వ కొలువు దక్కించుకునేందుకు నిరుద్యోగులు ప్రిపరేషన్లో బిజీగా ఉన్నారు.
ప్రభుత్వం ఆమోదం తెలిపిన గ్రూప్ 1 పోస్టులు ఇవే..
డిప్యూటీ రిజిస్ట్రార్ ఆఫ్ కోపరేటివ్ సొసైటీస్ పోస్టులు: 5