Free RTC Bus: పదో తరగతి విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌.. ఆరోజు నుంచి బస్సుల్లో ఉచిత ప్రయాణం..

|

Apr 22, 2022 | 6:12 AM

SSC Exams 2022 : పదో తరగతి విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం (AP Government) శుభవార్త చెప్పింది. పరీక్షలు రాసే విద్యార్థులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేలా సర్కారు ఉత్తర్వులు ఇచ్చింది.

Free RTC Bus: పదో తరగతి విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌.. ఆరోజు నుంచి బస్సుల్లో ఉచిత ప్రయాణం..
Follow us on

SSC Exams 2022 : పదో తరగతి విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం (AP Government) శుభవార్త చెప్పింది. పరీక్షలు రాసే విద్యార్థులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేలా సర్కారు ఉత్తర్వులు ఇచ్చింది. పదో తరగతి పరీక్షల సమయంలో విద్యాకేంద్రం నుంచి పరీక్ష కేంద్రానికి, తిరుగు ప్రయాణం ఆర్టీసీబస్ లలో ఉచితంగా వెళ్లవచ్చని ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇందుకోసం విద్యార్థులు హాల్‌టికెట్‌ చూపించాల్సి ఉంటుంది. కాగా పదో తరగతి పరీక్షలపై జిల్లా కలెక్టర్లతో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా బస్సు పాస్ లేని విద్యార్థులు హాల్ టికెట్ చూపించి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించవచ్చని పేర్కొన్నారు.

హాల్ టికెట్ చూపించి..
కాగా ఏపీలో ఈ నెల 27 నుంచి మే 9వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ ఏడాది మొత్తం 6,22,746 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 3,780 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేసింది. ఉదయం 9.30 నిమిషాల నుంచి మధ్యాహ్నం12.45 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఈక్రమంలో పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు హాల్ టికెట్ చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. పరీక్షలు ఉన్న రోజుల్లో పరీక్ష కేంద్రానికి వెళ్లేందుకు, తిరిగి ఇంటికి చేరుకునేందుకు ఆర్టీసీ పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని విద్యాశాఖ అధికారులు తెలిపారు. పరీక్షలు నిర్వహించి తేదీల్లో మాత్రమే ఈ ఉచిత ప్రయాణానికి అనుమతిస్తారు. ఒకవేళ పబ్లిక్ హాలిడేలు, సెలవు ప్రకటించిన రోజుల్లో కూడా పరీక్షలు ఉంటే విద్యార్థులకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తారు. ఈ మేరకు సంబంధిత డిపోల మేనేజర్లు జిల్లా విద్యాశాఖ అధికారులతో చర్చించి విద్యార్థులకు సరిపడే సంఖ్యలో బస్సులు ఏర్పాటుచేయాలని కోరారు. ఈ విషయాన్ని విద్యార్థులకు తెలియజేయాలని ఉపాధ్యాయులను ఆదేశించారు.

Also Read: Arizona Wildfire: ఆరిజోనాను వణికిస్తున్న కార్చిచ్చు.. కార్చిచ్చుకు 25 ఇళ్ల, భవనాలు దగ్దం..

Scientific Reason: పిల్లలు రెండు తలలు, మూడు చేతులు, 6 వేళ్లతో పుట్టడానికి కారణం ఏమిటి! శాస్త్రీయ కారణాలు ఏమిటి?

Viral Photo: ఈ ఫోటోలో కొండచిలువ దాగుంది.. 10 సెకన్లలో కనిపెడితే మీరే జీనియస్.. 99% ఫెయిల్!