AP EEMT 2025 Merit Exam: ఏడో, పదో తరగతి విద్యార్ధులకు బంపరాఫర్.. EEMT మెరిట్‌ పరీక్ష 2025కు దరఖాస్తు చేశారా?

రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ ఆధ్వర్యంలోని ఫణి అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈఈఎంటీ 2026 మెరిట్‌ పరీక్ష నిర్వహిస్తుంది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకునే విద్యార్ధులు నవంబరు 14వ తేదీలోపు నమోదు చేసుకోవల్సి ఉంటుంది. ఈ మేరకు డీఈవో యూవీ సుబ్బారావు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో

AP EEMT 2025 Merit Exam: ఏడో, పదో తరగతి విద్యార్ధులకు బంపరాఫర్.. EEMT మెరిట్‌ పరీక్ష 2025కు దరఖాస్తు చేశారా?
Andhra Pradesh EEMT 2025 merit exam

Updated on: Nov 04, 2025 | 10:25 AM

అమరావతి, నవంబర్‌ 4: ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్యా శాఖ ఆధ్వర్యంలోని ఫణి అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈఈఎంటీ 2026 మెరిట్‌ పరీక్ష నిర్వహిస్తుంది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకునే విద్యార్ధులు నవంబరు 14వ తేదీలోపు నమోదు చేసుకోవల్సి ఉంటుంది. ఈ మేరకు డీఈవో యూవీ సుబ్బారావు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో 7, 10వ తరగతులు చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్ష రాసేందుకు అర్హులు. ఈ పరీక్షను ప్రిలిమ్స్, మెయిన్స్‌ అనే రెండు దశల్లో నిర్వహిస్తారు. ప్రిలిమ్స్‌ పరీక్ష విద్యార్థి ఎక్కడైనా రాయవచ్చు. అంటే ఇంటి వద్ద లేదా పాఠశాలలో ఆన్‌లైన్‌లో రాయవల్సి ఉంటుంది. ఇందులో మెరిట్‌ సాధించిన విద్యార్ధులను మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు. ఈ పరీక్ష నిర్దేశించిన పరీక్ష కేంద్రాల్లో నిర్వహిస్తారు.

ఇందులో 10వ తరగతి స్థాయిలో రాష్ట్ర స్థాయిలో తొలి మూడు ర్యాంకులు సాధించిన విద్యార్ధులకు రూ.30 వేలు, రూ.25 వేలు, రూ.20 వేల చొప్పున నగదు బహుమతి ఇస్తారు. ఇక 7వ తరగతి విద్యార్థులకు కూడా తొలి మూడు ర్యాంకులు సాధించిన వారికి రూ.20 వేలు, రూ.15 వేలు, రూ.10 వేలు చొప్పున నగదు బహుమతులు అందజేస్తారు. ఇక జిల్లా స్థాయి పరీక్షలో తొలి మూడు స్థానాలు సాధించిన పదో తరగతి విద్యార్థులకు రూ.8 వేలు, రూ.6 వేలు, రూ.4 వేలు, ఏడో తరగతిలో రూ.5 వేలు, రూ.4 వేలు, రూ.3 వేలు చొప్పున అందజేస్తారు. మండల స్థాయిలో విజేతలకు సర్టిఫికెట్లను, జ్ఞాపికలను అందజేస్తారు. ఈ మెరిట్‌ పరీక్షలో మొత్తం 162 మంది విద్యార్థులకు రూ.9 లక్షలు బహుమతిగా అందజేయనున్నారు. ఇతర వివరాలకు డీఈవో కార్యాలయం లేదా 94931 52349 నంబరును సంప్రదించవచ్చు.

మరో 2 రోజుల్లో ముగుస్తున్న తెలంగాణ ఓపెన్‌ పది, ఇంటర్‌ ప్రవేశాలు

చదువు మాధ్యలో మానేసిన వారు తిరిగి చదువుకునేందుకు సార్వత్రిక విద్యా విధానం (టాస్‌) ప్రతీయేట అవకాశాలు కల్పిస్తుంది. 2025-26 విద్యా సంవత్సరానికి ఓపెన్‌లో పదో తరగతి, ఇంటర్‌ పూర్తి చేయడానికి ప్రవేశాల గడువు పొడిగించినట్లు హనుమకొండ జిల్లా అడిషనల్‌ కలెక్టర్ ఎ.వెంకట్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఆలస్య రుసుముతో నవంబరు 7వ తేదీ వరకు ప్రవేశాలకు అవకాశం కల్పించినట్లు చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.