AP 10th Exams: ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌.. మరోసారి పరీక్ష రాసే అవకాశం..

|

Jun 16, 2022 | 5:32 PM

AP 10th Exams: పదో తరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ శుభవార్త తెలిపింది. ఎన్నడూ లేని విధంగా పదో తరగతి విద్యార్థులకు బెటర్‌మెంట్‌ పరీక్షను రాసే అవకాశం కల్పించారు...

AP 10th Exams: ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌.. మరోసారి పరీక్ష రాసే అవకాశం..
Follow us on

AP 10th Exams: పదో తరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ శుభవార్త తెలిపింది. ఎన్నడూ లేని విధంగా పదో తరగతి విద్యార్థులకు బెటర్‌మెంట్‌ పరీక్షను రాసే అవకాశం కల్పించారు. ఇటీవల ప్రకటించిన ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించి తక్కువ మార్కులు సాధించిన విద్యార్థుల కోసం ఈ అవకాశాన్ని కల్పించారు. 50 కంటే తక్కువ మార్కులు వచ్చిన ఏవైనా రెండు సబ్జెక్టులకు బెటర్‌మెంట్ పరీక్ష రాసుకునే వీలు కల్పించారు. ఫెయిల్‌ విద్యార్థుల కోసం నిర్వహించే సప్లమెంటరీ పరీక్షలతో ఈ బెటర్‌ మెంట్ పరీక్షలను నిర్వహించనున్నారు.

ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఒక్కో పరీక్షకు రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ బెటర్‌ మెంట్‌ పరీక్షలు కేవలం ఈ ఏడాదికి మాత్రమే పరిమతం అని విద్యా శాఖ అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే ఏపీలో సప్లమెంటరీ పరీక్షలను 06-07-2022 నుంచి 15-07-2022 వరకు నిర్వహించనున్న విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే ఇప్పటి వరకు ఈ బెటర్‌ మెంట్‌ విధానంలో కేవలం ఇంటర్‌లో మాత్రమే అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. అయితే కరోనా పరిస్థితుల నేపథ్యంలో గత రెండేళ్లుగా పరీక్షలు నిర్వహించకపోవడం, నేరుగా పై తరగతులకు ప్రమోట్‌ చేసిన నేపథ్యంలో విద్యార్థులపై పెరిగిన ఒత్తిడిని దృష్టిలో పెట్టుకొని అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..