Ap 10th Exams: ఏపీ పదో తరగతి పరీక్షల్లో పేపర్‌ లీక్‌ కలకలం.. వాట్సాప్‌ గ్రూప్‌లలో ప్రశ్నాపత్రం..

Ap 10th Exams: ఆంధప్రదేశ్‌ పదో తరగతి పరీక్షల్లో పేపర్‌ లీక్‌ వ్యవహారం కలకలం రేపింది. పరీక్ష ప్రారంభమైన అరగంటలోపే వాట్సాప్‌ గ్రూప్‌లో ప్రశ్నాపత్రం ప్రత్యక్షం కావడం ఒక్కసారిగా షాక్‌కు గురి చేసింది...

Ap 10th Exams: ఏపీ పదో తరగతి పరీక్షల్లో పేపర్‌ లీక్‌ కలకలం.. వాట్సాప్‌ గ్రూప్‌లలో ప్రశ్నాపత్రం..
Ap 10th Exams

Updated on: Apr 27, 2022 | 11:24 AM

Ap 10th Exams: ఆంధప్రదేశ్‌ పదో తరగతి పరీక్షల్లో పేపర్‌ లీక్‌ వ్యవహారం కలకలం రేపింది. పరీక్ష ప్రారంభమైన అరగంటలోపే వాట్సాప్‌ గ్రూప్‌లో ప్రశ్నాపత్రం ప్రత్యక్షం కావడం ఒక్కసారిగా షాక్‌కు గురి చేసింది. బుధవారం పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కంపోసిట్ తెలుగు పేపర్‌ వన్‌ పరీక్ష ప్రారంభమైన కాసేపటికే ప్రశ్నాపత్రం వాట్సాప్‌ గ్రూప్‌లో ప్రత్యక్షమైంది. చిత్తూరులో ఈ లీకింగ్‌ సంఘటన జరిగింది. 9 గంటలకు పరీక్ష ప్రారంభమైతే 9.57కి వాట్సాప్‌ గ్రూప్‌లలో క్వశ్చన్‌ పేపర్‌ వాట్సాప్‌ గ్రూప్స్‌లో చక్కర్లు కొడుతోంది.

ఇంతకీ ఈ ప్రశ్నాపత్రం ఎక్కడి నుంచి లీకైంది. పరీక్ష ప్రారంభానికి ముందే లీక్‌ చేశారా.? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విషయం తెలుసుకున్న అధికారులు విచారణ ప్రారంభించారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది నుంచి విద్యార్థులకు అరంగంట ఆలస్యంగా పరీక్ష కేంద్రానికి వచ్చినా అనుమతిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఈ ప్రశ్నాపత్రం లీక్‌ వ్యవహారం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఇక రెండేళ్ల తర్వాత మొదటిసారిగా పదో తరగతి పరీక్షలు ఏడు పేపర్లతో జరుగుతున్నాయి. పదో తరగతి పరీక్షల కారణంగా ఎగ్జామ్ సెంటర్స్ నిర్వహిస్తున్న స్కూళ్లల్లో పని వేళలు మార్పు చేశారు. 6-9 తరగతులకు మధ్యాహ్నం రెండు గంటల నుంచి 4.45 గంటల వరకు సమ్మేటివ్ – 2 పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తలకు క్లిక్ చేయండి..

Also Read: Banana For Control BP: బీపీ ఉన్న వారు అరటిపండు తినడం మంచిదేనా..? నిపుణులు ఏమంటున్నారంటే..

Andhra Pradesh: ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రైవేటు బస్సు, లారీ ఢీ.. డ్రైవర్ మృతి

TRS Plenary: టీఆర్ఎస్ ప్లీనరీకి తరలివస్తోన్న గులాబీ కార్యకర్తలు.. 33 రకాల పసందైన వంటకాలు…