
అమరావతి, జనవరి 20: ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. టైం టేబుల్ ప్రకారం పదో తరగతి పబ్లిక్ పరీక్షల 2026 మార్చి 16 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం అవుతాయి. ఏప్రిల్ 1 వరకు ఇవి జరగనున్నాయి. ఆయా తేదీల్లో ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. ఫిజికల్, బయాలజికల్ సైన్స్ పరీక్షలు మాత్రం 9.30 నుంచి 11.30 వరకు జరుగుతాయి. ప్రభుత్వ సెలవుల ప్రకారం అవసరమైతే టైమ్‌టేబుల్‌లో మార్పులు ఉంటాయని సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు స్పష్టం చేసింది. ప్రశ్నపత్రం తారుమారైతే రాసిన అభ్యర్థుల ఫలితాలు రద్దు చేస్తామని హెచ్చరికలు జారీ చేసింది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.