AIA Recruitment 2022: డిగ్రీ/డిప్లొమా అర్హతతో.. ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో 125 అప్రెంటిస్‌ ఖాళీలు..

|

Nov 09, 2022 | 4:41 PM

భారత ప్రభుత్వ పౌరవిమానయాన మంత్రిత్వశాఖకు చెందిన కోల్‌కతాలోని ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా.. 125 గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌, టెక్నికల్ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ..

AIA Recruitment 2022: డిగ్రీ/డిప్లొమా అర్హతతో.. ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో 125 అప్రెంటిస్‌ ఖాళీలు..
AIA Apprentice Recruitment 2022
Follow us on

భారత ప్రభుత్వ పౌరవిమానయాన మంత్రిత్వశాఖకు చెందిన కోల్‌కతాలోని ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా.. 125 గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌, టెక్నికల్ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో నాలుగేళ్ల డిగ్రీ లేదా మూడేళ్ల ఇంజనీరింగ్‌ డిప్లొమా లేదా ఐటీఐ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఆగస్టు 31, 2022వ తేదీ నాటికి దరఖాస్తుదారుల వయసు 26 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో డిసెంబర్‌ 4, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక విధానం నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.12,000ల నుంచి రూ.15,000ల వరకు స్టైపెండ్‌ చెల్లిస్తారు. ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

  • సివిల్‌ (గ్రాడ్యుయేట్‌) ఖాళీలు: 6
  • ఎలక్ట్రికల్‌ (గ్రాడ్యుయేట్‌) ఖాళీలు: 7
  • ఎలక్ట్రానిక్స్‌ (గ్రాడ్యుయేట్‌) ఖాళీలు: 13
  • కంప్యూటర్‌ సైన్స్‌/ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (గ్రాడ్యుయేట్‌) ఖాళీలు: 3
  • మెకానికల్‌/ఆటోమొబైల్‌ (గ్రాడ్యుయేట్‌) ఖాళీలు: 1
  • సివిల్‌ (డిప్లొమా) ఖాళీలు: 10
  • ఎలక్ట్రికల్‌ (డిప్లొమా) ఖాళీలు: 10
  • ఎలక్ట్రానిక్స్‌ (డిప్లొమా) ఖాళీలు: 25
  • కంప్యూటర్‌/ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (డిప్లొమా) ఖాళీలు: 10
  • మెకానికల్‌/ఆటోమొబైల్‌ (డిప్లొమా) ఖాళీలు: 5
  • ఐటీఐ ట్రేడ్ (కంప్యూటర్‌ ఆపరేటర్‌ ప్రోగ్రామింగ్‌ అసిస్టెంట్‌, ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌) ఖాళీలు: 35

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.