AIIMS Recruitment: ఏయిమ్స్‌లో టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక.

|

May 19, 2023 | 1:11 PM

ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌లో ఆఫ్‌ మెడికల్ సైన్సెస్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలో పలు విభాగాల్లో ఉన్న టీచింగ్ పోస్టులను రెగ్యులర్‌ విధానంలో భర్తీ చేయనున్నారు. అభ్యర్థులను ఎలాంటి రాత పరీక్ష లేకుండానే నేరుగా ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా తీసుకోనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?

AIIMS Recruitment: ఏయిమ్స్‌లో టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక.
Aiims Jobs
Follow us on

ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌లో ఆఫ్‌ మెడికల్ సైన్సెస్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలో పలు విభాగాల్లో ఉన్న టీచింగ్ పోస్టులను రెగ్యులర్‌ విధానంలో భర్తీ చేయనున్నారు. అభ్యర్థులను ఎలాంటి రాత పరీక్ష లేకుండానే నేరుగా ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా తీసుకోనున్నారు. ఈ ఖాళీలు రాయ్ పూర్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉన్నాయి. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 116 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో ప్రొఫెసర్, అడిషనల్‌ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* అనాటమీ, కార్డియాలజీ, డెర్మటాలజీ, ఈఎన్‌టీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, మైక్రోబయాలజీ, నెఫ్రాలజీ విభాగాల్లో ఈ టీచింగ్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఖాళీల ఆధారంగా సంబంధిత విభాగంలో ఎండీ, ఎంఎస్, ఎంసీహెచ్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీంతో పాటు సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇతరులు మాత్రం రూ. 3000 చెల్లించాల్సి ఉంటుంది.

* దరఖాస్తుల స్వీకరణకు జూన్‌ 16ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..