AIIMS Recruitment: ఏయిమ్స్‌లో 644 ఉద్యోగాలు.. అభ్యర్థులను ఎలా ఎంపిక చేస్తారంటే.

|

Jun 02, 2023 | 8:05 PM

ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ పట్నా క్యాంపస్‌లో పలు విభాగాల్లో 644 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ (DMS), పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్(PRO), సీనియర్..

AIIMS Recruitment: ఏయిమ్స్‌లో 644 ఉద్యోగాలు.. అభ్యర్థులను ఎలా ఎంపిక చేస్తారంటే.
Aiims Jobs
Follow us on

ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ పట్నా క్యాంపస్‌లో పలు విభాగాల్లో 644 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ (DMS), పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్(PRO), సీనియర్ ప్రోగ్రామర్, సీనియర్ డైటీషియన్, ఆయుష్ మెడికల్ ఆఫీసర్, యోగా వంటి నాన్‌ టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 644 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, సీనియర్ ప్రోగ్రామర్, సీనియర్ డైటీషియన్, ఆయుష్ మెడికల్ ఆఫీసర్, యోగా, ఇన్‌స్ట్రక్టర్, ప్రైవేట్ సెక్రటరీ, సీనియర్ హిందీ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల‌ ఆధారంగా పదో తరగతి, ఐటీఐ, 10+2, డిగ్రీ, డిప్లొమా, పీజీ డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు మే 06న ప్రారంభమైన జూన్ 04వ తేదీతో ముగియనుంది.

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..