భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన చత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్.. 89 ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అనాటమీ, కార్డియాలజీ, జనరల్ సర్జరీ, హాస్పిట్ అడ్మినిస్ట్రేషన్, అనెస్థీషియా, బయోకెమిస్ట్రీ, కార్డియాలజీ, డెర్మటాలజీ, ఈఎన్టీ, ఫోరెన్సిక్ మెడిసిన్/టాక్సికాలజీ, జనరల్ మెడిసిన్, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, ఆప్తల్మాలజీ, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్ సర్జరీ, పీడియాట్రిక్స్, పాథాలజీ, సైకియాట్రి, పల్మనాలజీ మెడిసిన్, రేడియోలజీ, యూరాలజీ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు తప్పనిసరిగా పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో డీఎన్‌బీ/ఎండీ/ఎంఎస్/డీఎం/ఎంసీహెచ్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు 58 యేళ్లకు మించకుండా ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ విధానంలో నవంబర్ 30, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న తర్వాత హార్డు కాపీ డౌన్‌లోడ్ చేసుకుని కింది అడ్రస్‌కు డిసెంబర్ 7వ తేదీలోపు పంపించవల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులకు రూ. 2000, ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులకు రూ.1000లు అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. వికలాంగ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. స్క్రూటినీ, షార్ట్‌లిస్టింగ్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ప్రతిభకనబరచిన వారికి నెలకు రూ.1,01,500ల నుంచి రూ.2,20,400ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.
అడ్రస్: Administrative Officer, (Recruitment Cell), Administrative Block, 3rd Floor, All India Institute of Medical Sciences, Kothipura, Bilaspur, Himachal Pradesh-174037.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.