ADA Recruitment 2023: ఎలాంటి రాత పరీక్షలేకుండా ఏరోనాటికల్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీలో 100 ఉద్యోగాలు

|

Aug 21, 2023 | 2:09 PM

ఉద్యోగాల కోసం ఎదురు చూస్తోన్న నిరుద్యోగ యువత ఈ అర్హతలుంటే నేరుగా ఇంటర్వ్యూకి హాజరుకావచ్చు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. 2023, సెస్టెంబర్ 4, 07, 11, 14 తేదీల్లో కింది అడ్రస్లో నిర్వహించే ఇంటర్వ్యూకి సంబంధిత సర్టిఫికెట్లు, ధృవీకరణ పత్రాలతో నేరుగా హాజరుకావచ్చు. ఇంటర్వ్యూ ఉదయం 8:30 నుంచి 11 వరకు జరుగుతుంది. ఎంపికైన వారికి నెలకు రూ.39,370 నుంచి రూ.46,990 వరకు స్టైపెండ్‌ చెల్లిస్తారు..

ADA Recruitment 2023: ఎలాంటి రాత పరీక్షలేకుండా ఏరోనాటికల్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీలో 100 ఉద్యోగాలు
Aeronautical Development Agency
Follow us on

భారత రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన బెంగళూరులోని ఏరోనాటికల్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ(ఏడీఏ).. 100 ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మెకానికల్‌, ప్రొడక్షన్‌ ఇంజినీరింగ్‌, మెటిరీయల్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌, సివిల్‌ ఇంజినీరింగ్‌, ఇన్ఫోసైన్స్‌, కమ్యునికేషన్‌ ఇంజినీరింగ్‌ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి. ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు తప్పనిసరిగా సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్‌/ ఇంజినీరింగ్‌ డిగ్రీ/ ఎంఈ/ ఎంటెక్‌/ ఎంఎస్సీ కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయసు 28 ఏళ్లకు మించకుండా ఉండాలి.

ఉద్యోగాల కోసం ఎదురు చూస్తోన్న నిరుద్యోగ యువత ఈ అర్హతలుంటే నేరుగా ఇంటర్వ్యూకి హాజరుకావచ్చు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. 2023, సెస్టెంబర్ 4, 07, 11, 14 తేదీల్లో కింది అడ్రస్లో నిర్వహించే ఇంటర్వ్యూకి సంబంధిత సర్టిఫికెట్లు, ధృవీకరణ పత్రాలతో నేరుగా హాజరుకావచ్చు. ఇంటర్వ్యూ ఉదయం 8:30 నుంచి 11 వరకు జరుగుతుంది. ఎంపికైన వారికి నెలకు రూ.39,370 నుంచి రూ.46,990 వరకు స్టైపెండ్‌ చెల్లిస్తారు.

పోస్టుల వివరాలు..

  • మెకానికల్‌/ప్రొడక్షన్‌ ఇంజనీరింగ్‌/మెటలర్జీ/మెటీరియల్ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో ఖాళీల సంఖ్య: 23
    ఎయిరోనాటికల్‌/ఎయిరోస్పేస్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో ఖాళీల సంఖ్య: 2
  • సివిల్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో ఖాళీల సంఖ్య: 2
  • కంప్యూటర్‌ సైన్స్‌/ఇన్ఫో టెక్‌/ఇన్ఫో సైన్స్‌ విభాగంలో ఖాళీల సంఖ్య: 25
  • ఎలక్ట్రానిక్స్‌/ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యునికేషన్/టెలీ కమ్యునికేషన్‌/ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌/ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ విభాగంలో ఖాళీల సంఖ్య: 48

అడ్రస్..

ఏడీఏ క్యాంపస్‌ 2, సురన్‌జన్‌దాస్‌ రోడ్‌, న్యూ థిప్పసంద్ర పోస్ట్‌, బెంగళూరు 560075.

ఇవి కూడా చదవండి

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.