TS Inter Results: తెలంగాణ ఇంటర్‌ ఫలితాలపై కీలక అప్‌డేట్‌.. రిజల్ట్స్‌ వచ్చేది ఆ రోజే.

|

May 06, 2023 | 3:26 PM

తెలంగాణలో ఇంటర్‌ ఫలితాల విడుదలకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన కసరత్తులు తుది దశకు చేరుకుంటున్నాయి. రాష్ట్రంలో ఇంటర్‌ పరీక్షలు మార్చి 15 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరిగిన విషయం తెలిసిందే. ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షలకు 4,82,501 మంది, సెకండ్‌ ఇయర్‌కు4,23,901 మంది హాజరయ్యారు...

TS Inter Results: తెలంగాణ ఇంటర్‌ ఫలితాలపై కీలక అప్‌డేట్‌.. రిజల్ట్స్‌ వచ్చేది ఆ రోజే.
TS Inter Results
Follow us on

తెలంగాణలో ఇంటర్‌ ఫలితాల విడుదలకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన కసరత్తులు తుది దశకు చేరుకుంటున్నాయి. రాష్ట్రంలో ఇంటర్‌ పరీక్షలు మార్చి 15 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరిగిన విషయం తెలిసిందే. ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షలకు 4,82,501 మంది, సెకండ్‌ ఇయర్‌కు4,23,901 మంది హాజరయ్యారు. ఇక ఇంటర్‌ పరీక్షలు ముగిసిన వెంటనే మూల్యాంకన ప్రక్రియ ప్రారంభించగా ఏప్రిల్ రెండో వారంలో పూర్తయింది. ఈ నేపథ్యంలోనే ఫలితాలను వీలైనంత త్వరగా విడుదల చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

మరో వారం రోజుల్లో అంటే ఈ నెల 13వ తేదీలోగా ఫలితాలను ప్రకటించాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే కసరత్తులు ప్రారంభించారు. ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకూడదనే ఉద్దేశంతో మార్కుల క్రోడీకరణ, డీకోడింగ్ ప్రక్రియపై ఇప్పటికే పలు మార్లు ట్రయల్ రన్‌ సైతం నిర్వహించారు. వీటిలో ఎలాంటి సమస్యలు తలెత్తకపోవడంతో ఫలితాలను విడుదల చేయడానికి అధికారులు సిద్ధమయ్యారు. ఫలితాలకు సంబంధించి పూర్తి కసరత్తును సోమవారం నాటికి పూర్తి చేసి, మంగళవారం విద్యా శాఖ మంత్రితో అధికారులు చర్చించనున్నట్లు తెలుస్తోంది. మంత్రి అనుమతి పొందిన తర్వాత మంగళవారం ఫలితాలపై ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..