Survey: ఉద్యోగులకు ఈ ఏడాది పండగే.. పెద్ద ఎత్తున జీతాలు పెంచడానికి సిద్ధమవుతోన్న కంపెనీలు..

|

Mar 03, 2022 | 6:40 AM

Survey: మొన్నటి వరకు కరోనా (Corona) ఉద్యోగాలపై తీవ్ర ప్రభావం చూపిన విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో చాలా వరకు కంపెనీలు నియమకాలు తగ్గించాయి. అలాగే కొన్ని సంస్థలైతే ఏకంగా ఉన్న...

Survey: ఉద్యోగులకు ఈ ఏడాది పండగే.. పెద్ద ఎత్తున జీతాలు పెంచడానికి సిద్ధమవుతోన్న కంపెనీలు..
Jobs
Follow us on

Survey: మొన్నటి వరకు కరోనా (Corona) ఉద్యోగాలపై తీవ్ర ప్రభావం చూపిన విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో చాలా వరకు కంపెనీలు నియమకాలు తగ్గించాయి. అలాగే కొన్ని సంస్థలైతే ఏకంగా ఉన్న ఉద్యోగుల జీతాలకు కూడా కోత పెట్టాయి. ఇక ఇంక్రిమెంట్స్‌ అన్న మాటకు స్థానమే లేకుండా పోయింది. అయితే తాజాగా మార్పులు వస్తున్నాయి. కరోనా భయాలు పూర్తిగా తొలిగిపోవడంతో ఆర్థిక కార్యకలాపాలు మళ్లీ ఎప్పటిలాగే ఊపందుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఈ ఏడాది సంస్థలు భారీగా జీతాలు పెంచాలనే ఆలోచన ఉన్నాయని ఓ సర్వేలో తేలింది. డెలాయిట్‌ టచ్‌ టోమట్సు ఇండియా (డీటీటీఐ) ఎల్‌ఎల్‌పీ నిర్వహించిన ‘2022 వర్క్‌ఫోర్స్‌ అండ్‌ ఇంక్రిమెంట్స్‌ ట్రెండ్స్‌ సర్వే’లో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

ఈ సర్వే ప్రకారం సగటును 9.1 శాతం జీతాల పెంపు ఉంటుందని అంచనా. అంతేకాకుండా ఈ ఏడాది నియామకాలు కూడా ఊపందుకుంటాయని సర్వేలో తేలింది. ఇక వలసలూ భారీగా పెరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో సంస్థలు తమ ఉద్యోగులను కాపాడుకునే క్రమంలోనే ఇంక్రిమెంట్ల బాట పడుతున్నాయని డీటీటీఐఎల్‌ఎల్‌పీ భాగస్వామి ఆనంద్‌రూప్‌ ఘోస్‌ తెలిపారు. ఇక సర్వేలో పాల్గొన్న సంస్థల్లో 34 శాతం కంపెనీలు తమ ఉద్యోగులకు రెండంకెల స్థాయిలో జీతాలను పెంచే ఆలోచనలలో ఉన్నాయి.

ఈ సర్వేలో సుమారు 450కి పైగా సంస్థలు పాల్గొన్నాయి. ఇక గతంతో పోలిస్తే అన్ని ప్రధాన రంగాల్లో జీతాల పెంపు భారీగా ఉండొచ్చని సర్వే అభిప్రాయపడింది. ఇదిలా ఉంటే ఈ ఏడాది ముఖ్యంగా లైఫ్‌ సైన్సెస్‌, ఐటీ రంగాల్లో ఎక్కువ జీతాలు పెరగనున్నాయని సర్వేలో తేలింది. ఫైనాన్షియల్‌ టెక్నాలజీ, ఐటీ ఉత్పాదక సంస్థలు, డిజిటల్‌/ఈ-కామర్స్‌ కంపెనీలు తమ ఉద్యోగులకు రెండంకెల స్థాయిలో జీతాలు పెంచనున్నాయని అంచనా.

Also Read: ఎర్రని ముద్దమందారంల మెరిసిపోతున్న లేడీ సూపర్ స్టార్….

Porsche cars: సముద్రం మధ్యలో పోర్షా కార్లు.. దాదాపు 1,100 పోర్షా కార్లు.. ఏం జరిగిందంటే..? (వీడియో)

Russia-Ukraine War: పుతిన్‌కు మోదీ ఫోన్ కాల్.. భారతీయులు వెళ్లేందుకు 6 గంటల వెసులుబాటు