Hyderabad Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. హైదరాబాద్‌లోని ఆ కంపెనీలో ఉద్యోగ అవకాశాలు..!

|

Dec 17, 2021 | 9:16 PM

Hyderabad Jobs: ప్రస్తుతం కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిన తర్వాత ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. ఆయా రంగాల్లో ఖాళీగా ఉన్న..

Hyderabad Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. హైదరాబాద్‌లోని ఆ కంపెనీలో ఉద్యోగ అవకాశాలు..!
Follow us on

Hyderabad Jobs: ప్రస్తుతం కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిన తర్వాత ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. ఆయా రంగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తున్నాయి. ఇక రాబోయే రెండు నెలల్లో 500 మంది ఉద్యోగులను నియమించుకోనున్నట్లు 3ఐ ఇన్ఫోటెక్‌ వెల్లడించింది. హైదరాబాద్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన బిజినెస్‌ ప్రాసెస్‌ సర్వీసెస్‌ (BPS) విభాగాన్ని పెంచాలని యోచిస్తోంది. ఆటోమేషన్‌, డిజిటైజేషన్‌కు అనుగుణంగా వివిధ రంగాల వ్యాపార సంస్థలకు సిద్ధం చేసేందుకు తమ బీపీఎస్‌ విభాగం ప్రత్యేక టెక్నాలజీ పరిష్కారాన్ని ఆవిష్కరించిందని 3ఐ ఇన్ఫోటెక్‌ ఎండీ వెల్లడించారు. హైదరాబాద్‌లోని హైటెక్‌ సిటీలోగల తమ కొత్త బీపీఎస్‌ విభాగం కోసం నియామకాలు చేపట్టనున్నట్లు కంపెనీ తెలిపింది.

ఈ నేపథ్యంలో నైపుణ్యం, ప్రతిభగల ఉద్యోగులను ఆకర్షించేందుకు ఇటు ఆఫ్‌లైన్‌లో, అటు సోషల్‌, డిజిటల్‌ వేదికల ద్వారా ఆన్‌లైన్‌లోనూ రిక్రూట్‌మెంట్‌కు నిర్వహించాలని భావిస్తోంది. అయితే హైదరాబాద్‌లో ఉన్న వారికే మొదటి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ప్రతిభావంతులైన స్థానిక యువతనే ఉద్యోగాల్లో నియమించుకోనుంది. దీని ద్వారా ప్రాంతీయ మార్కెట్‌లో పట్టు సాధించాలన్నదే కంపెనీ వ్యూహం. ఆ తర్వాత దశల్లో ఇతర ప్రాంతాల మార్కెట్లపై దృష్టి పెట్టాలని కంపెనీ భావిస్తోంది. అప్లికేషన్‌, ఆటోమేషన్‌, అనలిటిక్స్‌ సేవల విభాగాల్లో ఉద్యోగావకాశాలున్నాయి. రిటైల్‌, ఈ-కామర్స్‌, టెలికం, బీఎఫ్‌ఎస్‌ఐ, మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌, తయారీ తదితర రంగాల్లో సంస్థకు కస్టమర్లున్నారు.

ఇవి కూడా చదవండి:

Bank Of Baroda Jobs: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో 52 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. దరఖాస్తు గడువు ఎప్పటి వరకు అంటే..

TS Inter Results: తెలంగాణ ఇంటర్ ఫలితాలపై వివాదం.. తక్కువ మందిని పాస్ చేశారని విద్యార్థుల ఆందోళన