Regularization of contract employees: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు శాఖల్లో కాంట్రక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్న వారిని క్రమబద్దీకరిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయా శాఖల్లో కాంట్రాక్టు ఉద్యోగులుగా ఉన్న వారి వివరాలు పంపించాలని కోరుతూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది కూడా. ఆ ప్రకారంగానే తమ తమ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలు అధికారులు సేకరించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్నవారు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 11,000ల మందిదాకా ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈక్రమంలో ఆయా ఉద్యోగులకు సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ నిర్వహించగా దాదాపుగా 230 మంది కాంట్రాక్టు లెక్చరర్లు (contract lecturers) ఫేక్ సర్టిఫికెట్లతో పలు కాలేజీల్లో పనిచేస్తున్నట్లు బయటపడింది. దీంతో వారందరిపై చర్యలు తీసుకోనున్నట్లు ఈ సందర్భంగా అధికారులు తెలిపారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.