UPSC CSE-2030 vacancies: దేశవ్యాప్తంగా 1472 ఐఏఎస్‌, 864 ఐపీఎస్‌, 1057 ఐఎఫ్‌ఎస్‌ పోస్టుల ఖాళీలు

|

Dec 15, 2022 | 8:39 AM

దేశంలో ఐఏఎస్‌ పోస్టులు 1472, ఐపీఎస్‌ పోస్టులు 864, ఇండియన్‌ ఫారెస్ట్ సర్వీస్‌ (ఐఎఫ్‌ఎస్) పోస్టులు 1057లు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర జింగ్‌ వెల్లడించారు..

UPSC CSE-2030 vacancies: దేశవ్యాప్తంగా 1472 ఐఏఎస్‌, 864 ఐపీఎస్‌, 1057 ఐఎఫ్‌ఎస్‌ పోస్టుల ఖాళీలు
UPSC CSE-2030 vacancies
Follow us on

దేశంలో ఐఏఎస్‌ పోస్టులు 1472, ఐపీఎస్‌ పోస్టులు 864, ఇండియన్‌ ఫారెస్ట్ సర్వీస్‌ (ఐఎఫ్‌ఎస్) పోస్టులు 1057లు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర జింగ్‌ వెల్లడించారు. బుధవారం (డిసెంబర్‌ 14) లోక్‌సభకు ఈ మేరకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. జనవరి 1, 2022 నాటికి మంజూరైన పోస్టులు వరుసగా.. ఐఏఎస్ 6,789, ఐపీఎస్ 4,984, ఐఎఫ్‌ఎస్ 3,191. వీరిలో 5,317 మంది ఐఏఎస్ అధికారులు, 4,120 మంది ఐపీఎస్ అధికారులు, 2,134 మంది ఐఎఫ్‌ఎస్ అధికారులు సర్వీసులో ఉన్నట్లు మంత్రి తెలిపారు.

ఖాళీలు సంభవించడ, భర్తీ చేయడం అనేది నిరంతర ప్రక్రియ. ఖాళీగా ఉన్న పోస్టులను త్వరితగతిన భర్తీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రతీయేట ఐఏఎస్, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ పోస్టులను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన ఖాళీల భర్తీకి పరీక్షలను నిర్వహిస్తున్నట్లు మంత్రి చెప్పారు. యూపీఎస్సీ సీఎస్‌ఈ-2021 ద్వారా నియామక ప్రక్రియ చేపట్టిన కమిషన్‌ 748 మంది అభ్యర్థుల్లో 91 మందిని డిసెంబర్ 7, 2022 వరకు ఏ సర్వీస్‌కు కేటాయించలేదని అన్నారు. 2022-23 నియామకాలకు ఎంత మంది ఐఏఎస్‌లను తీసుకోవాలో సిపార్సు చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు మంత్రి జితేంద్ర జింగ్‌ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.