Zomato: ఇకపై జొమాటోలో ఆ సేవలు కూడా.. పేటీఎంతో రూ. 2వేల కోట్ల ఢీల్‌..

|

Aug 22, 2024 | 8:47 AM

ప్రముఖ ఫుడ్‌ డెలివరీ యాప్‌ జొమాటో తన సేవలను విస్తరిస్తోంది. కేవలం ఫుడ్‌ డెలివరీకి మాత్రమే పరిమితం కాకుండా ఇతర సేవలను సైతం యూజర్లకు అందిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే జొమాటో యూపీఐ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. జొమాటో నుంచి ఫుడ్‌ ఆర్డర్‌ చేసుకొని పేమెంట్‌ కోసం...

Zomato: ఇకపై జొమాటోలో ఆ సేవలు కూడా.. పేటీఎంతో రూ. 2వేల కోట్ల ఢీల్‌..
Zomato
Follow us on

ప్రముఖ ఫుడ్‌ డెలివరీ యాప్‌ జొమాటో తన సేవలను విస్తరిస్తోంది. కేవలం ఫుడ్‌ డెలివరీకి మాత్రమే పరిమితం కాకుండా ఇతర సేవలను సైతం యూజర్లకు అందిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే జొమాటో యూపీఐ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. జొమాటో నుంచి ఫుడ్‌ ఆర్డర్‌ చేసుకొని పేమెంట్‌ కోసం ఇతర పేమెంట్‌ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించుకునే పనిలేకుండా నేరుగా జొమాటోలోనే పేమెంట్ చేసేందుకు గాను ఈ సేవలను తీసుకొచ్చినట్లు కంపెనీ ప్రకటించింది.

ఇదిలా ఉంటే తాజాగా మరో కొత్త సర్వీస్‌ను జొమాటో పరిచయం చేసింది. జొమాటోలో ఇకపై సినిమా టికెట్లు, ఈవెంట్ టికెట్లు బుక్‌ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా పేటీఎంతో జొమాటో ఢీల్‌ చేసుకుంది. పేటీఎంకు చెందిన మూవీ, ఈవెంట్స్ టికెటింగ్ వ్యాపారాలను కొనుగోలు చేయనున్నట్టు జొమాటో ఓ ప్రకటన విడుదల చేసింది. ఎంటర్‌టైన్‌మెంట్ సెగ్మెంట్‌లోనూ సత్తా చాటేందుకు జొమాటో ఈ నిర్ణయం తీసుకుంది. మూవీ, ఈవెంట్స్ టికెటింగ్ వ్యాపారాలను 244.2 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేయనున్నట్లు జొమాటో ప్రకటించింది. మన కరెన్సీలో చెప్పాలంటే సుమారు రూ. 2వేల కోట్లకు పైమాటే.

కాగా ప్రస్తుతం ఈ రంగంలో బుక్‌మై షో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అయితే సినిమాలు, లైవ్ ఈవెంట్ల కోసం భారతదేశ ఆన్​లైన్​ టికెటింగ్ మార్కెట్​లో పోటీనిచ్చేందుకే జొమాటో ఈ నిర్ణయం తీసుకుంది. సినిమా టికెట్లను విక్రయించే ‘టికెట్ న్యూ’ ప్లాట్​ఫామ్​తో పాటు లైవ్ ఈవెంట్లకు టికెట్లను నిర్వహించే ‘ఇన్​సైడర్’ ప్లాట్​ఫామ్​ని విక్రయించడం ద్వారా తన మార్కెట్ వాటాను పేటీఎం జొమాటోకు అప్పగించనుంది. ఈ కొనుగోలుతో వచ్చే రెండేళ్లలో నాన్ కోర్ వ్యాపారాల్లో ఆదాయం మూడు రెట్లు పెరుగుతుందని తమ షేర్​హోల్డర్స్​కి లెటర్​లో పేర్కొంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..