
వ్యాపారం చేయాలి.. బాగా డబ్బు సంపాదించాలి.. జీవితంలో సెటిల్ అవ్వాలి. ఇలాంటి ఆలోచనలు చాలా మందికి ఉంటాయి. కానీ, పరిస్థితుల ప్రభావంతోనో, పెట్టుబడి లేకనో, ఏ వ్యాపారం చేయాలో తెలియకో.. ఏదో ఒక ఉద్యోగం చేస్తూ జీవితాన్ని నెట్టుకొస్తుంటారు. కానీ, ఒక్క రూపాయి కూడా పెట్టుబడి అవసరం లేకుండా ఒక అద్భుతమైన బిజినెస్ చేయొచ్చు. పైగా మీరే ఓ 50 నుంచి 100 మందికి ఉపాధి కల్పించ్చు. మరి ఆ బిజినెస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రస్తుతం ఏ కార్యక్రమం అయినా భోజనాలు పెట్టడం సర్వసాధారణం అయిపోయింది. అది శుభకార్యమైనా, అశుభకార్యమైనా, మీటింగ్‌లైనా.. ఇలా ఏదో ఒక చోటు ఏదో ఒక కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. ఈ కాలంలో అందరూ వచ్చిన అతిథులకు మంచి భోజనాలు మాత్రమే కాదు పెట్టే విధానంలో కూడా రిచ్‌నెస్ కనిపించాలని భావిస్తున్నారు. అందుకోసం మంచి డ్రెస్ కోడ్‌తో క్యాటరింగ్ బాయ్స్ ఉండాలని అనుకుంటున్నారు. ఇప్పుడు ఇదే మీ బిజినెస్ ఐడియా. ఒక క్యాటరింగ్ ఏజెన్సీ ఏర్పాటు చేసుకొని, పార్ట్‌టైమ్‌గా ఏదో ఒక పని చేయాలని చూస్తున్న కుర్రాళ్లను ఒక టీమ్‌గా చేసుకొని వారితో క్యాటరింగ్ చేయిస్తూ.. క్లైయింట్ దగ్గర ఒక మనిషికి రూ.500 నుంచి రూ.1000 వరకు తీసుకొని.. అందులో మీరు రూ.50 నుంచి 100 వరకు కమీషన్ తీసుకొని, మిగితాది కుర్రాళ్లుకు ఇచ్చేస్తే సరి.
అలా రోజుకు ఒక్క ప్రోగ్రామ్‌కి ఓ 30 మందిని తీసుకెళ్లినా.. మీకు రూ.3000 వస్తాయి. నెలకు రూ.90 వేలు పక్కా. అయితే ప్రతీ రోజు ఉంటుందా క్యాటరింగ్ అంటే, పరిచయాలు పెంచుకొని పని ఉండేలా చేసుకోవడమే. ఒక రోజు 10 మందితో చేయిస్తే మరో రోజు 50 మంది అవసరం అయ్యే ప్రోగ్రామ్ రావొచ్చు. ఇలా మీరేమి చేయకుండా జస్ట్ మ్యానేజ్ చేస్తూ.. క్యాటరింగ్ బాయ్స్‌కి, కార్యక్రమం చేసే వారికి మధ్య వారధిలా ఉంటూ.. వారి అవసరం తీర్చడమే కాదు.. పార్ట్‌టైమ్ వర్క్ చేసుకోవాలి అనుకునే వారికి ఉపాధి కూడా కల్పించవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి