ప్రపంచంలోని ఎలక్ట్రిక్ బైక్ ప్రియులను అబ్బురపరుస్తూ ఓ కొత్త స్టార్టప్ కంపెనీ న్యూలుక్ ఓ బైక్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. లుక్స్ పరంగానే కాకుండా ఫీచర్లపరంగా చూసుకున్నా ఈ బైక్ చాలా మెరుగ్గా ఉంది. ఇప్పుడున్న ఏ బైక్ కూడా దీని డిజైన్‌లో లేకుండా కంపెనీ కొత్తగా బైక్‌ను లాంచ్ చేశారు. ఇది పట్టణ ప్రాంతం వారికి అనుగుణంగా ఉంటుంది. అయితే జాప్ ఐ 300 సీసీ బైక్ ఎలక్ట్రిక్ స్టెప్ త్రూ స్కూటర్‌లా కంపెనీ చెబుతుంది. ఈ లండన్, యూకే ఆధారిత సంస్థను 2017లో స్థాపించారు. ఈ బైక్‌లో జెడ్ ఆకారంలో ఉన్న ఎస్కోస్కెలిటిన్ ఫ్రేమ్ చుట్టూ స్కూటర్ వంటి స్టెప్ త్రూ డిజైన్‌తో ఉంటుంది. ఈ ఐ 300 బైక్ యాక్సలరేషన్, డైనమిక్స్‌తో బైక్ ప్రియులను ఆకట్టుకుంటుంది. అలాగే బ్యాటరీలు లేకుండా ఈ స్కూటర్ బరువు 92 కిలోలని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. తేలికైన అలాయ్, కాంపోజిట్ బాడీ వర్క్‌ను ఉపయోగించడం వల్ల ఈ బైక్ ఇంత తేలికగా ఉంటుందని పేర్కొంటున్నారు. అయితే ఈ బైక్ తేలికగా ఉన్నా 150 కిలోల లోడ్ పరిమితి ఉంది. అలాగే 14 అంగుళాల చక్రాలతో ఫ్రంట్ ఫోర్క్స్, మార్చుకోదగిన ఫ్రంట్ ఫెండర్, సర్దుబాటు చేయగల పుష్ రోడ్ సస్పెన్షన్ కలిగి ఉంది.
ఈ జాప్ బైక్ 14 కెడబ్ల్యూ పవర్, 587 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేసే ఐపీఎం ఎలక్ట్రిక్ మోటర్ నుంచి శక్తిని పొందుతుంది. ఇది కార్బన్ ఫైబర్ బెల్ట్ డ్రైవ్‌ను సపోర్ట్ చేస్తుంది. 2.2 సెకన్లలోనే 30 కిలో మీటర్ల స్పీడ్ అందుకోవడం ఈ బైక్ ప్రత్యేకత. అలాగే 5 సెకన్ల కంటే తక్కువలో 60 కిలోమీటర్ల స్పీడ్‌ను అందుకుంటుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. 720 డబ్ల్యూహెచ్ సామర్థ్యంతో రెండు తొలగించగల 72 వీ లిథియం ఐయాన్ బ్యాటరీలతో ఈ బైక్ వస్తుంది. కేవలం 40 నిమిషాల్లోనే 80 శాతం వరకూ చార్జ్ చేసుకునే అవకాశం ఈ బైక్ సొంతం. అయితే ఈ బైక్ ప్రస్తుతం రిజర్వ్‌లో ఉంది. అనేక రంగుల్లో ఈ బైక్ అందుబాటులో ఉంటుంది. ఎంట్రీ లెవెల్ మోడ్ 7400 డాలర్లుగా కంపెనీ పేర్కొంది. అలాగే పరిమిత లాంచ్ ఎడిషన్ మోడలైతే 10140 డాలర్లుగా కంపెనీ ధర నిర్ణయించింది. ఈ బైక్‌ను నేరుగా జాప్ వెబ్‌సైట్ నుంచి బుక్ చేసుకోవచ్చు. ప్రపంచంలో ఎక్కడికైనా ఈ బైక్‌ను డెలివర్ చేస్తారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..