Bumper Offers: స్మార్ట్‌ టీవీ కొనాలనుకుంటున్నారా?.. అయితే బంపర్ ఆఫర్ మీకోసమే..

|

Jun 24, 2021 | 1:50 PM

Bumper Offers: కొత్తగా స్మార్ట్ టీవీ కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే మీకోసమే ఈ శుభవార్త. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ...

Bumper Offers: స్మార్ట్‌ టీవీ కొనాలనుకుంటున్నారా?.. అయితే బంపర్ ఆఫర్ మీకోసమే..
Smart Tv
Follow us on

Bumper Offers: కొత్తగా స్మార్ట్ టీవీ కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే మీకోసమే ఈ శుభవార్త. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ టీవీ కొనుగోళ్లపై కళ్లు చెదిరే ఆఫర్లును ప్రకటించింది. ఎంఐ, థామ్సన్, రియల్‌మి, ఐఫాల్కాన్ కంపెనీలకు చెందిన స్మార్ట్ టీవీలపై భారీ డిస్కౌంట్ ఇస్తోంది. ఫ్లిప్‌కార్ట్ ఆఫర్‌లో భాగంగా రేటు ఇలా ఉన్నాయి.

ప్రస్తుతం ఎల్జీ, శాంసంగ్ స్మార్ట్ టీవీల తరువాత అంత క్రేజ్ ఎంఐ టీవీలకు ఉంది. ఈ నేపథ్యంలోనే ఎంఐ స్మార్ట్ టీవీలకు కూడా భారీ డిస్కౌంట్ ఇస్తోంది ఫ్లిప్‌కార్ట్. రూ.19,999 విలువ చేసే ఎంఐ 4ఏ ప్రో 32 అంగుళాల స్మార్ట్ టీవీని కేవలం రూ. 15,499 కే ఇస్తోంది. అలాగే 50 అంగుళాల 4కే స్మార్ట్ టీవీపై కూడా భారీ తగ్గింపునిస్తోంది. ధర రూ. 41,999 విలువ చేసే ఈ టీవీని రూ. 34,999 లకే లభిస్తోంది. ఇక రియల్‌మి 32 అంగుళాల హెచ్‌డీ రెడీ స్మార్ట్ టీవీపై 11 శాతం తగ్గింపు లభిస్తోంది. దీని అసలు ధర రూ.17,999 కాగా, రూ.15,999కే లభిస్తోంది. అలాగే 43 అంగుళాల 4కే స్మార్ట్ టీవీ ధర రూ.28,999 లకు లభిస్తోంది. వాస్తవానికి దీని ధర రూ.32,999.

ఐఫాల్కాన్ టీవీలు ఇంకా తక్కువ ధరకే లభిస్తున్నాయి. 32 అంగుళాల హెచ్‌డీ రెడీ స్మార్ట్ టీవీ రూ.12,999 లకే అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ.18,999. ఇక ఐఫాల్కాన్ 43 అంగుళాల అల్ట్రా హె‌చ్‌డీ 4కే స్మార్ట్ టీవీపై భారీ తగ్గింపు లభిస్తోంది. దీని అసలు ధర రూ.76 వేల పైమాటే. కానీ ఇది రూ.26,999కే అందుబాటులో ఉంది. 55 అంగుళాల 4కే స్మార్ట్‌టీవీ రూ.39,999 లకే లభిస్తుంది.

Also read:

Worlds Chocolate Museums: ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన చాక్లెట్ మ్యూజియంలు ఇవే.. ఎక్కడున్నాయంటే..