
ఇటీవల కాలంలో బంగారంలో పెట్టుబడులు విపరీతంగా పెరుగుతున్నాయి. మార్కెట్‌లోని ఒడిదుడుకుల నుంచి రక్షణకు పెట్టుబడిదారులు బంగారాన్ని ప్రత్యామ్నాయంగా ఎంచుకుంటున్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా బంగారాన్ని పెట్టుబడి అంశంగా పరిగణిస్తే ఒక్క భారతదేశంలోనే బంగారాన్ని ఆభరణాలు కింద చూస్తారు. ముఖ్యంగా పెళ్లిళ్ల సమయంలో బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు. అయితే బంగారం మనం ఎంత పెద్ద షాపులో కొన్నా అది స్వచ్ఛమైన బంగారమేనా? అనే అనుమానం మనల్ని పీకుతూ ఉంటుంది. అయితే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) ‘ బీఐఎస్ కేర్ యాప్’ రూపంలో ఈ అనుమానాలను నివృత్తి చేస్తుంది. బంగారం కొనుగోలుదారులకు సహాయం చేయడానికి రూపొందించిన ఈ యాప్ అన్ని ఐఎస్‌ఐ, హాల్‌మార్క్-సర్టిఫైడ్ బంగారం, వెండి ఆభరణాలను ట్రాక్ చేయడంలో సహాయపడుతుంది. ఈ యాప్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
బీఐఎస్ కేర్ యాప్ వినియోగదారులకు హాల్‌మార్క్ బంగారు ఆభరణాల స్వచ్ఛతకు సంబంధించిన నిజ-సమయ ధ్రువీకరణను అందిస్తుంది. ఇది ఆండ్రాయిడ్, ఆపిల్ ఐఫోన్ వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. యాప్‌ను డౌన్‌లోడ్ చేయడానికి, సంబంధిత యాప్ స్టోర్‌లను సందర్శించాలి. అంటే ఆండ్రాయిడ్ వినియోగదారులు ప్లే స్టోర్ నుంచి, ఐఫోన్ వినియోగదారులు యాపిల్ యాప్ స్టోర్ నుంచి బీఐఎస్ కేర్ యాప్‌ను డౌన్‌లోన్ చేసుకోవచ్చు. ఈ రెండు ప్లాట్‌ఫారమ్‌లలో ఈ యాప్ 4 స్టార్ రేటింగ్‌ను పొందింది. అంటే ఈ యాప్ యూజర్ ఫ్రెండ్లీగా ఉందని అర్థం చేసుకోవచ్చు. ఈ యాప్‌లో మనం కొనుగోలు చేసిన బంగారు ఆభరణాల ప్రామాణికత గురించిన ఆందోళనలను తగ్గించడానికి ‘వెరిఫై హెచ్‌యూఐడీ ఫీచర్’ని పరిచయం చేసింది. ఈ ఫీచర్ హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ (హెచ్‌యూఐడీ)ని నమోదు చేయడం ద్వారా బంగారు వస్తువుల చట్టబద్ధతను నిర్ధారించుకోవచ్చు. బీఐఎస్ వెబ్‌సైట్ ఎఫ్‌ఏక్యూల ప్రకారం బంగారు ఆభరణాల హాల్‌మార్కింగ్ ఆరు విభాగాల్లో అనుమతిస్తుంది. 14కే, 18కే, 20కే, 22కే, 23కే, 24కే బంగారం స్వచ్ఛతను తెలుసుకోవచ్చు.
ముఖ్యంగా ఈ యాప్‌లో లైసెన్స్ నంబర్, హెచ్‌యూఐడీ నంబర్ లేదా రిజిస్ట్రేషన్ నంబర్‌ను నమోదు చేయడం ద్వారా, వినియోగదారులు తయారీదారు పేరు, చిరునామా, లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ చెల్లుబాటు, కవర్ రకాలు, చేర్చబడిన బ్రాండ్‌లు, లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన ప్రస్తుత స్థితి, స్వచ్ఛత వంటి సంబంధిత వివరాలను పొందవచ్చు. కాబట్టి బీఐఎస్ కేర్ యాప్‌ను సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి, వినియోగదారులు ప్లాట్‌ఫారమ్‌లో నమోదు చేసుకోవాలి. అనంతరం అనుసరించాల్సిన పద్ధతుల గురించి ఓ సారి తెలుసుకుందాం.
ఈ ఫీచర్‌ను ఉపయోగించి గుర్తించిన ఉత్పత్తులకు సంబంధించిన ప్రామాణికతను తనిఖీ చేయవచ్చు.
హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్‌ను ఉపయోగించి హెచ్‌యూఐడీ నంబర్‌తో హాల్‌మార్క్ ఆభరణాలకు సంబంధించిన ప్రామాణికతను ధ్రువీకరించవచ్చు. అయితే బిల్లుపై హెచ్‌యూఐడీ తప్పనిసరిగా ఉండకపోవచ్చని గమనించాలి. దీని కోసం కొనుగోలు చేసిన స్టోర్ నుంచి నిర్ధారణ అవసరం.
ఈ ఫీచర్ ద్వారా భారతీయ ప్రమాణం, దానికి వ్యతిరేకంగా లైసెన్స్‌లు, ఉత్పత్తికి సంబంధించిన ప్రయోగశాలల సమాచారం తెలుసుకోవచ్చు.