UPI Transactions: ఇంటర్‌నెట్ అందుబాటులో లేకపోయినా యూపీఐ ట్రాన్సాక్షన్స్‌ చేసుకోవచ్చు.. ఎలాగో తెలుసా.?

|

Oct 03, 2021 | 1:25 PM

UPI Transactions: ప్రస్తుతం ఏ చిన్న దుకాణంలో చూసినా యూపీఐ ట్రానాక్షన్స్‌ బార్‌ కోడ్‌లు కనిపిస్తున్నాయి. చాయ్‌ నుంచి మొదలు పెద్ద పెద్ద వస్తువుల వరకు..

UPI Transactions: ఇంటర్‌నెట్ అందుబాటులో లేకపోయినా యూపీఐ ట్రాన్సాక్షన్స్‌ చేసుకోవచ్చు.. ఎలాగో తెలుసా.?
Follow us on

UPI Transactions: ప్రస్తుతం ఏ చిన్న దుకాణంలో చూసినా యూపీఐ ట్రానాక్షన్స్‌ బార్‌ కోడ్‌లు కనిపిస్తున్నాయి. చాయ్‌ నుంచి మొదలు పెద్ద పెద్ద వస్తువుల వరకు అన్ని రకాల క్రయవిక్రయాలకు యూపీఐ యాప్‌లను ఉపయోగిస్తున్న రోజులివి. నగదు లావాదేవీలు పూర్తిగా తగ్గిపోతున్నాయి. అందరూ మొబైల్స్‌లో రెండు నుంచి మూడు యూపీఐ యాప్‌లను ఉపయోగిస్తున్నారు. అయితే ఏ యాప్‌ నుంచి యూపీఐ ట్రాన్సాక్షన్‌ చేయాలన్నా కచ్చితంగా ఇంటర్‌నెట్‌ అందుబాటులో ఉండాల్సిందే. మరి కొన్ని సందర్భాల్లో ఇంటర్‌నెట్‌ బ్యాలెన్స్‌ పూర్తవడమో, లేదా నెట్‌వర్క్‌ సరిగా లేకపోతే ఎలా చెప్పండి. ఆఫ్‌లైన్‌లో డబ్బులు పంపించుకునే వెసులు బాటు ఉంటే భలే ఉంటుంది కదూ.!

ఈ సందుపాయం కూడా అందుబాటులో ఉందన్న విషయం మీలో ఎంత మందికి తెలుసు. ఇంటర్‌నెట్‌ అందుబాటులో లేకపోయినా ఆఫ్‌లైన్‌ విధానంలో డబ్బులను పంపించుకోవచ్చు. ఇందుకోసం కొన్ని స్టెప్‌లను పాటించాల్సి ఉంటుంది. అవేంటంటే..

* ఇందుకోసం ముందుగా మీ మొబైల్‌ ఫోన్‌లో ‘*99#’ను టైప్‌ చేయాలి.

* మొదటిసారి ఈ సేవలను ఉపయోగించుకుంటుంటే భాషను సెలక్ట్‌ చేసుకోవాలి.

* అనంతరం మీ బ్యాంకు పేరు లేదా ఐఎఫ్‌ఎస్‌ కోడ్‌తో ఎంటర్‌ చేయాలి.

* ఇలా రిజిస్ట్రేషన్‌ చేసుకున్న తర్వాత మీకు 1. send money, 2.Request money, 3.Check Balance, 4.My Profile, 5.Pending Requests, 6. Transactions ఆప్షన్లు కనిపిస్తాయి.

* ఇందులో మీకు కావాల్సిన ఆప్షన్‌పై క్లిక్‌ చేసి యూపీఐ పిన్‌ ఎంటర్‌ చేస్తే ట్రాన్సాక్షన్‌ విజయవంతమవుతుంది.

చూశారుగా ఇంటర్‌నెట్‌ లేకపోయినా డబ్బులు ఎలా పంపించుకోవచ్చో. మరెందుకు ఆలస్యం మీరూ కూడా ఓ సారి ఈ సింపుల్‌ ట్రిక్‌ను ఫాలో అవ్వండి.

Also Read: Viral Video: సరదా కోసం చేసిన పనికి దిమ్మ తిరిగిపోయింది.. షాకింగ్ వీడియో మీకోసం..

Chinese-Taiwan: దుష్ట చైనా దుష్ట పన్నాగం.. రెండు రోజులుగా తైవాన్‌‌ను భయపెడుతున్న డ్రాగన్ కంట్రీ..

Health: నోట్లో ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయా? ఎందుకైనా మంచిది టెస్ట్‌ చేయించుకోండి.. డయాబెటిస్‌ అయ్యుండొచ్చు.