Financial planning: మీ జీవిత భాగస్వామికి ఈ లక్షణాలున్నాయా..? మీరు ధనవంతులు కావడం ఖాయం

ఒక వ్యక్తిని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లే లక్షణాలలో అతడి ఆర్థిక క్రమశిక్షణ కీలకంగా ఉంటుంది. దానితోనే పొదుపు అలవడుతుంది. డబ్బును ఆదా చేయడంతో పాటు వివిధ మార్గాల్లో పెట్టుబడులు పెట్టే అవకాశం కల్పిస్తుంది. అలాగే జీవిత భాగస్వామి కూడా ఈ ప్రక్రియంలో ప్రధాన భూమిక పోషిస్తారు. ఆమె\అతడు ఆర్థిక విషయాల్లో ఎలా ఉంటారనే విషయంపై ఆ కుటుంబ ప్రగతి ఆధారపడి ఉంటుంది.

Financial planning: మీ జీవిత భాగస్వామికి ఈ లక్షణాలున్నాయా..? మీరు ధనవంతులు కావడం ఖాయం
Money

Updated on: Jun 01, 2025 | 5:30 PM

వివాహ బంధం సజావుగా సాగటానికి ప్రేమ పునాది అయితే డబ్బు ఊపిరి లాంటింది. భార్యాభర్తల మధ్య సమన్వయం లేకపోతే ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ కింద తెలిపిన అంశాల్లో జీవిత భాగస్వామి మీకు అనుకూలంగా ఉంటే మీకు ఆర్థిక సమస్యలు రానట్టే.

సంభాషణలు

డబ్బు విషయంలో భార్యాభర్తల మధ్య క్రమం తప్పకుండా సంభాషణలు జరగాలి. ఎంత ఆదాయం వచ్చింది, ఏమి ఖర్చులున్నాయో మాట్లాడుకోవాలి. దీని వల్ల ఇద్దరికీ బాధ్యత అలవడుతుంది. ఒకరు పొదుపుగా ఉండి, మరొకరు దుబారా చేస్తే ప్రయోజనం ఉండదు. డబ్బు విషయం గురించి భాగస్వామితో చర్చించడానికి ఆలోచించకూడదు. అలాగే ఒకరు తమ ప్రణాళికలు చెబితే, మరొకరు మాట్లాడకుండా ఉండడం సరికాదు.

దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలు

దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల గురించి భార్యాభర్తలు చర్చించుకోవాలి. రాబోయే ఐదు, పది, ఇరవై ఏళ్లలో మీరు ఏమి సాధించాలనుకుంటున్నారు, అంటే ఇల్లు కొనడం, బంగారం కొనడం, వివిధ పెట్టుబడులు పెట్టడం తదితర వాటిపై చర్చలు జరగాలి. అప్పుడే వారి మధ్య ఆర్థిక సామరస్యం ఏర్పడుతుంది.

ఇవి కూడా చదవండి

ఖర్చు, పొదుపు

ఖర్చు, పొదుపు విషయంలో భార్యాభర్తలు ఏకాభిప్రాయంతో ఉండాలి. ఒకరు విపరీతంగా షాపింగ్ చేయడం, మరొకరు బాగా పొదుపు చేయడం వల్ల కొంత కాలానికి గొడవలు వస్తాయి. ఇలాంటి సందర్భంలో వారిద్దరూ సమన్యయంతో బడ్జెట్ రూపొందించుకోవాలి. అవసరాలు, సరదాలకు మధ్య తేడాలను లెక్కించుకోవాలి.

నిజాయితీ

భార్యభర్తలు తమ అప్పుల గురించి నిజాయితీగా మాట్లాడుకోవాలి. తనఖాలు, క్రెడిట్ కార్డు బాలెన్సులు, విద్యార్థి రుణాలు, స్నేహితుల నుంచి తీసుకున్నరుణం తదితర విషయాలను దాచకూడదు. ఒకరితో ఒకరు చెప్పుకోవడం వల్ల ఇద్దరూ కలిసి వాటిని తీర్చే అవకాశం ఉంటుంది. అలాగే నిజాయితీ కారణంగా బంధం మరింత బలపడుతుంది.

బడ్జెట్

ఇంటి నిర్వహణకు అవసరమైన బడ్జెట్ ను జంటగా తయారు చేసుకోవాలి. వచ్చే ఆదాయం, ఖర్చులు, పొదుపు, పెట్టుబడులు, వినోదాలు, విహరాలు .. ఇలా అన్నింటికి కలిసి బడ్జెట్ తయారు చేసుకోవాలి. దీని వల్ల ఆదాయం, ఖర్చుల గురించి ఇద్దరికీ తెలుస్తుంది. తద్వారా ఆర్థిక క్రమశిక్షణ అలవడుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..