Yes Bank Alert: ఈ బ్యాంకు కస్టమర్లకు అలర్ట్‌.. డిసెంబర్‌ 1 నుంచి ఈ సర్వీసు నిలిపివేత

|

Nov 29, 2022 | 6:36 PM

బ్యాంకు సేవల్లో నిబంధనలు మారుతూ ఉంటాయి. కస్టమర్లకు అందించే సర్వీసుల్లో మార్పులు చేస్తుంటాయి బ్యాంకులు. ప్రతి నెల రాగానే బ్యాంకింగ్ రంగంలో ఎన్నో కీలక..

Yes Bank Alert: ఈ బ్యాంకు కస్టమర్లకు అలర్ట్‌.. డిసెంబర్‌ 1 నుంచి ఈ సర్వీసు నిలిపివేత
Yes Bank
Follow us on

బ్యాంకు సేవల్లో నిబంధనలు మారుతూ ఉంటాయి. కస్టమర్లకు అందించే సర్వీసుల్లో మార్పులు చేస్తుంటాయి బ్యాంకులు. ప్రతి నెల రాగానే బ్యాంకింగ్ రంగంలో ఎన్నో కీలక మార్పులు జరుగుతుంటాయి. ఏటీఎం, బ్యాంకు లావాదేవీలు, డిపాజిట్స్‌, విత్‌డ్రా తదితర అంశాలలు మార్పులు జరుగుతుంటాయి. అయితే ఇలాంటి మార్పులను బ్యాంకులు తమ తమ కస్టమర్లకు ముందస్తుగా సందేశాలు పంపుతుంటుంది. వాటిని గమనించి అప్రమత్తం కావాల్సి ఉంటుంది. ఇక మీరు యెస్‌ బ్యాంకు కస్టమర్లు అయితే ఈ విషయాన్ని తెలుసుకోవాలి. తాజాగా యెస్ బ్యాంక్ ఇటీవల తన సేవల్లో మార్పును చేసింది. బ్యాంకు ఈ మార్పు గురించి తన కస్టమర్లందరికీ సందేశం ద్వారా తెలియజేసింది.

బ్యాంకు కస్టమర్లు తమ ఖాతాల్లో ఎంత బ్యాలెన్స్‌ ఉందో తెలియజేసేందుకు బ్యాంకుకు ఎస్‌ఎంఎస్‌ చేస్తే బ్యాలెన్స్‌ వివరాలు తెలుస్తాయి. అయితే ఈ బ్యాంక్ మాత్రం ఎస్‌ఎంఎస్‌ బ్యాలెన్స్ అలర్ట్ ఫెసిలిటీలో మార్పులు చేసింది. ఇక నుంచి కస్టమర్‌లు ఎస్‌ఎంఎస్‌ ద్వారా బ్యాలెన్స్‌ని తెలుసుకోలేరు. ఈ కొత్త నిబంధన డిసెంబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. బ్యాంకు కస్టమర్లకు బ్యాలెన్స్‌ అలర్ట్‌ సర్వీసును నిలిపివేస్తున్నట్లు బ్యాకు తన కస్టమర్లకు సందేశం సైతం పంపినట్లు బ్యాంకు సిబ్బంది తెలిపారు. అంతేకాకుండా మీ ప్రస్తుత సబ్‌స్క్రిప్షన్ ప్రకారం మిగిలిన ఎస్‌ఎంఎస్‌ ప్రయోజనాలు పొందుతారు.

ఖాతాదారులు బ్యాలెన్స్‌ను తనిఖీ చేయడానికి ఆన్‌లైన్ సేవను ఉపయోగించవచ్చని యెస్ బ్యాంక్ తెలియజేసింది. ‘యస్ మొబైల్’ ఆన్‌లైన్, యెస్‌ రోబోట్ వంటి మా ఆన్‌లైన్ సేవలను ఉపయోగించవచ్చని, మీరు ఎప్పుడైనా, ఎక్కడైనా మీ బ్యాలెన్స్‌ని చెక్ చేసుకోవచ్చు అని బ్యాంక్ తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి