Yamaha motors: అతి తక్కువ డౌన్ పేమెంట్‌కే యమహా వాహనాలు.. ఆ మోడళ్లపై దీపావళి స్పెషల్ ఆఫర్

|

Oct 27, 2024 | 7:00 PM

దీపావళి పండగ సందర్బంగా మార్కెట్ లో ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. దుస్తుల నుంచి ఇళ్లలో వాడుకునే వస్తువుల వరకూ, ఎలక్ట్రానిక్స్ నుంచి ద్విచక్ర వాహనాల వరకూ భారీ తగ్గింపు ధరలతో అందుబాటులోకి వచ్చాయి. పండగ సందర్బంగా చాలా మంది ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేయడానికి ప్రాధాన్యత ఇస్తారు. ఈ సమయంలో వాహనం కొనుగోలు చేస్తే మంచిదని భావిస్తారు. దీనికి అనుగుణంగానే ద్విచక్ర వాహనాలపై ఆయా కంపెనీలు వివిధ ఆఫర్లు ప్రకటించాయి. పండగ సీజన్ లో విక్రయాలు పెంచుకోవడానికి చర్యలు తీసుకున్నాయి. దీనిలో భాగంగా యమహా కంపెనీ కూడా ఎంపిక చేసిన మోడళ్లపై ఆఫర్లు ప్రకటించింది.

Yamaha motors: అతి తక్కువ డౌన్ పేమెంట్‌కే యమహా వాహనాలు.. ఆ మోడళ్లపై దీపావళి స్పెషల్ ఆఫర్
Yamaha Motors Offers
Follow us on

జపాన్ కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ యమహా ఇండియా మోటార్స్ దీపావళి సందర్భంగా వివిధ మోడళ్లపై ఆఫర్లు ప్రకటించింది. ఎఫ్ జెడ్ సిరీస్, ఫాస్కినో, రే జెడ్ఆర్ మోడళ్లకు వీటిని వర్తింపజేసింది. అయితే ఇవి ఎప్పటి వరకూ కొనసాగుతాయో స్పష్టం చెప్పలేదు. అయితే దీపావళి సందర్భంగా పరిమితి కాలం వరకూ ఉండే అవకాశం ఉంది. వీటిపై క్యాష్ బ్యాక్ ఆఫర్లతో పాటు తక్కువ డౌన్ పేమెంట్ కు అందజేస్తుంది. పండగ సందర్భంగా ఖాతాదారులు ఎఫ్ జెడ్ వెర్ 4.0, ఎఫ్ జెడ్ – ఎస్ వెర్ 3.0, ఎఫ్ జెడ్ ఎఫ్ఐ మోడళ్లపై రూ.7 వేల వరకూ క్యాష్ బ్యాక్ పొందుతారు. కేవలం రూ.7,999 డౌన్ పేమెంట్ గా చెల్లించి వాహనం తీసుకువెళ్లవచ్చు. అలాగే ఫాస్కినో 125 ఎఫ్ఐ హైబ్రిడ్, రే జెడ్ ఆర్ 125 ఎఫ్ ఐ హైబ్రిడ్ మోడళ్లపై రూ.4 వేల క్యాష్ బ్యాక్ ఇస్తారు. వీటికి డౌన్ పేమెంట్ గా కేవలం రూ.2,999 చెల్లిస్తే చాలు.

యమహాకు చెందిన అన్ని మోడళ్లపై దీపావళి ఆఫర్ ఇవ్వడం లేదు. పైన తెలిపిన వాటికి మాత్రమే అమలు చేస్తున్నారు. మిగిలిన వైజెడ్ఎఫ్ – ఆర్ 3, ఎంపీ-03, వైజెడ్ఎఫ్- ఆర్15ఎం, వైజెడ్ఎఫ్- ఆర్15వీ4, వైజెడ్ఎఫ్- ఆర్15ఎస్ వీ3, ఎంటీ-15 వీ2, ఏరోక్స్ 155 తదితర వాటిపై ఎలాంటి ఆఫర్లు లేవు. అప్ డేట్ చేసిన యమహా ఆర్3 మోటారు సైకిల్ ను ఇటీవలే ఆ కంపెనీ ఆవిష్కరించింది. ముందు వెర్షన్ కంటే ఎక్కువ దూకుడుతో ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా టెయిల్ సెక్షన్ లో స్వల్ప మార్పు చేశారు. మొత్తానికి స్పోర్టివ్ లుక్ లో సూపర్ గా కనిపిస్తోంది.

యమహా ఆర్3 మోటారు సైకిల్ లో అదనపు ఫీచర్లను ఏర్పాటు చేశారు. గత మోడల్ కు సంబంధించి కస్టమర్లు చెప్పిన సమస్యలను పరిష్కరించారు. బ్లూటూత్ కనెక్టివిటీ కలిగిన ఎల్సీడీ ఇన్ స్ట్రుమెంట్ ప్యానెల్ తో పాటు అసిస్ట్, స్లిప్పర్ క్లచ్ తదితర వాటిని అప్ గ్రేడ్ చేశారు. ఇక ఇంజిన్ విషయానికి వస్తే ఆర్3 లో స్పెసిఫికేషన్ మార్చలేదు. దీనిలోని 321 సీసీ ట్విన్ ఇంజిన్ నుంచి 41.4 బీహెచ్ పీ, 29.5 ఎన్ ఎం టార్క్ విడుదల అవుతుంది. 6 స్పీడ్ ట్రాన్స్ మిషన్ తో పాటు మోటారు సైకిల్ ముందు వైపు కేవైబీ యూఎస్ డీ ఫోర్క్, వెనుక వైపు మోనో షాక్ సస్పెన్షన్ ఉన్నాయి. ముందు, వెనుక రెండు వైపులా డిస్క్ బ్రేకులు, డ్యూయల్ చానల్ ఏబీఎస్ అదనపు ప్రత్యేకతలుగా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి