Redmi Laptop: షియోమి సబ్‌బ్రాండ్ రెడ్‌మి నుంచి భారత మార్కెట్లోకి ఆగస్ట్ 3న తొలి ల్యాప్‌టాప్ విడుదల కానుంది. ఇప్పటికే రెడ్‌మీ 2019 నుంచి చైనా మార్కెట్లో ల్యాప్‌టాప్‌లను విక్రయిస్తుంది. అయితే దాదాపు రెండేళ్ల తర్వాత గ్లోబల్ మార్కెట్లోకి వీటిని విడుదల చేయనుంది. ఇందులో భాగంగా తొలిసారి భారత మార్కెట్లోకి ల్యాప్‌టాప్ విడుదల కానుంది. రెడ్‌మీ ఇటీవల నిర్వహించిన నోట్10టీ స్మార్ట్‌ఫోన్ లాంచింగ్ ఈవెంట్లో ఈ ల్యాప్‌టాప్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. దీన్ని రెడ్‌మిబుక్ లైనప్‌లో తీసుకురానున్నట్లు తెలిపింది. దీని డిజైన్, కలర్ ఆప్షన్లను ఇప్పటికే టీజ్ చేసింది. ఇది ముదురు బూడిద రంగులో రానున్నట్లు పేర్కొంది. ఈ మేరకు రెడ్‌మీ ఎండీ మను కుమార్ జైన్ ట్వీట్ చేశారు. ఆగస్ట్ 3న భారత మార్కెట్లోకి విడుదలయ్యే రెడ్‌మిబుక్ తో లాప్టాప్ మార్కెట్లోకి కూడా ప్రవేశించనున్నామని, రెడ్‌మీ ఉత్పత్తులైన పవర్ బ్యాంక్, టిడబ్ల్యుఎస్ ఇయర్‌బడ్‌లు, స్మార్ట్ టివి సరసన రెడ్‌మీ ల్యాప్‌టాప్‌లు కూడా చేరనున్నాయని అన్నారు.
అయితే, భారత మార్కెట్లోకి విడుదలయ్యేందుకు సిద్దంగా ఉన్న రెడ్‌మీ బుక్ ధర, ఫీచర్లను అధికారింగా వెల్లడించనప్పటికీ, సోషల్ మీడియాలో కొన్ని లీకులు చక్కర్లు కొడుతున్నాయి. రెడ్‌మీబుక్ 8వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ 7 ప్రాసెసర్‌తో రానుంది. దీనిలో ఎన్విడియా జిఫోర్స్ MX250 గ్రాఫిక్స్ కార్డ్‌ను అందించనున్నారు. ఇది 512GB వరకు సాలిడ్-స్టేట్ డ్రైవ్ (SSD), 10 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో వస్తుందని తెలుస్తోంది. ఈ ల్యాప్‌టాప్ 14 అంగుళాలు, 16 అంగుళాల డిస్ప్లేలు గల రెండు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. ఈ రెండూ రూ .50 వేల ధరల శ్రేణిలో వచ్చే అవకాశం ఉంది. రెడ్‌మీ భారతీయ పీసీ మార్కెట్లోకి ప్రవేశిస్తుండటంతో ఇది హెచ్‌పి, లెనోవా, డెల్, ఏసెర్ వంటి ప్రముఖ బ్రాండ్లకు గట్టి పోటీనివ్వనుంది.
Our resident tech fiddler @potato_lovah was too mesmerized by RedmiBook’s design to get any of his lines right. ?
And we are sure you won’t be able to take your eyes off either. ?#SuperStartLife with #RedmiBook on 03.08.21?
?Answer & WIN https://t.co/0LL34G2Znr ? pic.twitter.com/LUWBu0lkmB
— Redmi India – #RedmiBook Super Start Life (@RedmiIndia) July 28, 2021