పెరుగుతున్న ఇందన ధరల నేపథ్యంలో వినియోగదారులంతా ఎలక్ట్రిక్ కార్లు, బైక్ ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే ఎక్కువ మార్కెట్ కలిగిన భారత్ లో వివిధ కార్లు, బైక్ కంపెనీలు తమ కొత్త ఈవీ మోడళ్లను రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇదే కోవలో మొబైల్ తయారీ సంస్థ జియోమీ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోడానికి ఎలక్ట్రిక్ కార్ల తయారు చేస్తుందని పలు నివేదికలు సూచిస్తున్నాయి. కానీ కంపెనీ ఈ వార్తలను ధ్రువీకరించలేదు. ముఖ్యంగా ఈవీ మార్కెట్ లోకి టాప్ టెక్ కంపెనీ లు ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. సోనీ, యాపిల్, అప్పో వంటి కంపెనీలు ఈవీ మార్కెట్ వైపు మొగ్గు చూపుతున్నాయి. అయితే యాపిల్ కూడా 2025 లో ఎలక్ట్రిక్ కార్ ప్రవేశపెడుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. అయితే 2026లో యాపిల్ కొత్త ఈవీ కార్ మార్కెట్ లోకి వస్తుందని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ఇప్పుడు జియోమీ కూడా ఈవీ మార్కెట్ లోకి రావడానికి రంగం సిద్ధం చేసుకుంటుంది.
చైనాలోని మంచు రోడ్లల్లో జియోమీ ఈవీ కార్ ను పరీక్షించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. జియోమీ వ్యవస్థాపకుడు, సీఈఓ లీ జున్ న్యూ ఈవీ కార్ ను రైడ్ చేస్తూ కనిపించారని కొన్ని ఫొటోలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ ఫొటోను పరిశీలిస్తే జియోమీ తన న్యూ ఎలక్ట్రిక్ కార్ గురించి చాలా విషయాలను గోప్యంగా ఉంచింది. అయితే ఈ కార్ చూడడానికి చాలా క్లాసీ లుక్ తో ఎలిగెంట్ డిజైన్ తో వస్తుందని తెలుస్తోంది. ఈ కార్ స్పోర్టీ సెడాన్ గా కనిపిస్తుందని పలు మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలాగే ఈ కార్ లైడార్ సెన్సార్ ఉందని, డ్రైవింగ్ లేదా ఆటోమేటిక్ డ్రైవింగ్ ద్వాారా పని చేస్తుందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే ఈ కార్ గురించి అదనపు విషయాలు వెల్లడికావాల్సి ఉంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి