
Wrong Upi Transfer Follow These 3 Steps
డిజిటల్ చెల్లింపుల్లో భారత్ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోంది. ఇప్పుడు టీ షాప్ నుంచి లక్షల షాపింగ్ వరకు ఎక్కడ చూసినా యూపీఐ ట్రాన్స్‌క్షన్స్ హవా నడుస్తుంది. రీఛార్జులు, బిల్లులు చెల్లించడం కూడా యూపీఐతో చిటికెలో పనిగా మారింది. కానీ ఒక్కోసారి అనుకోకుండా వేరే వాళ్ల నంబర్‌కి డబ్బు పంపినప్పుడు గుండె గుభేల్ మంటుంది. మళ్లీ ఆ డబ్బు ఎలా వస్తుందో తెలియక చాలా మంది ఆందోళన చెందుతుంటారు. పొరపాటున ఇతర నెంబర్‌కు డబ్బును పంపితే వెంటనే ఏం చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఫిర్యాదు ఎక్కడ, ఎలా చేయాలి?
మీరు Google Pay, PhonePe, Paytm లేదా BHIM వంటి యాప్‌లను ఉపయోగించి పొరపాటున వేరే UPI ID కి డబ్బును ట్రాన్స్‌ఫర్ చేస్తే.. భయపడాల్సిన అవసరం లేదు. అయితే ఎంత తొందరగా ఫిర్యాదు చేస్తే అంత మంచిది.
స్టెప్ 1:
- మీ యాప్‌లోనే రిపోర్ట్ చేయండి
- మీరు మొదటగా చేయాల్సింది మీరే డబ్బు పంపిన యాప్‌లో కంప్లైంట్ ఇవ్వడం.
- మీ UPI యాప్ (PhonePe/GPay/Paytm) ఓపెన్ చేయండి.
- Transaction History లోకి వెళ్లండి.
- మీరు పొరపాటున చేసిన ట్రాన్సాక్షన్‌ను ఎంచుకోండి.
- Help లేదా Report Issue ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
- Wrong UPI Transaction అని సెలెక్ట్ చేసి.. ట్రాన్సాక్షన్ ID, UTR నంబర్ వంటి వివరాలు ఎంటర్ చేయండి.
స్టెప్ 2:
- మీ బ్యాంక్‌ను లేదా NPCI ని సంప్రదించండి
- మీరు యాప్‌లో ఫిర్యాదు చేసినా పరిష్కారం దొరకకపోతే బ్యాంకుకు కంప్లైంట్ చేయండి.
- బ్యాంక్: మీరు ఏ బ్యాంకు నుంచి డబ్బు పంపారో ఆ బ్యాంక్ కస్టమర్ కేర్‌కు కాల్ చేయండి లేదా నేరుగా బ్రాంచ్‌కు వెళ్లండి. లావాదేవీ వివరాలు ఇచ్చి ఫిర్యాదు నమోదు చేయండి.
- NPCI: UPI వ్యవస్థను చూసుకునే NPCIవెబ్‌సైట్‌కు వెళ్లి ఫిర్యాదు చేయవచ్చు. లేదా వారి టోల్-ఫ్రీ నంబర్ 1800-120-1740 కు కాల్ చేసి కూడా ఫిర్యాదు చేయవచ్చు.
స్టెప్ 3
- ఒకవేళ 30 రోజుల్లో సమస్య పరిష్కారం కాకపోతే ఇలా చేయండి..
- మీరు ఫిర్యాదు చేసిన తర్వాత కూడా 30 రోజుల్లో మీ సమస్య పరిష్కారం కాకపోతే మీరు మళ్లీ NPCI వెబ్‌సైట్‌లోని Dispute Redressal Mechanism విభాగంలో ఫిర్యాదు చేయవచ్చు.
మీరు ఇచ్చిన వివరాలన్నీ కరెక్ట్ అని NPCI నిర్ధారిస్తే మీ డబ్బు వెనక్కి ఇవ్వమని బ్యాంకుకు ఆదేశిస్తుంది. అందుకే ట్రాన్సాక్షన్ ID, UTR నంబర్ వంటి వివరాలు పక్కాగా ఉంచుకోండి. అంతేకాకుండా డబ్బు పొరపాటున పంపినట్లు తెలిసిన వెంటనే ఆలస్యం చేయకుండా, ఈ స్టెప్స్‌ను ఫాలో అవ్వండి. అప్పుడే మీ డబ్బును త్వరగా తిరిగి పొందే అవకాశం ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..