Wipro: విప్రో నాలుగో త్రైమాసికం ఫలితాలు విడుదల.. నాలుగు శాతం పెరిగిన నికర లాభం..

|

Apr 30, 2022 | 7:00 AM

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(IT) కంపెనీ విప్రో(Wipro).. నాలుగో త్రైమాసికం ఫలితాలు(Q4 Results) విడుదల చేసింది. కన్సాలిడేటెడ్ నికర లాభం మార్చి 2022 తో ముగిసిన త్రైమాసికంలో నాలుగు శాతం పెరిగింది...

Wipro: విప్రో నాలుగో త్రైమాసికం ఫలితాలు విడుదల.. నాలుగు శాతం పెరిగిన నికర లాభం..
Wipro
Follow us on

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(IT) కంపెనీ విప్రో(Wipro).. నాలుగో త్రైమాసికం ఫలితాలు(Q4 Results) విడుదల చేసింది. కన్సాలిడేటెడ్ నికర లాభం మార్చి 2022 తో ముగిసిన త్రైమాసికంలో నాలుగు శాతం పెరిగి రూ .3,092.5 కోట్లకు చేరుకుంది. గతేడాది 2020-21 ఇదే త్రైమాసికంలో రూ. 2,974.1 కోట్ల లాభాన్ని పొందింది. విప్రో మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ థియరీ డెలాపోర్టే మాట్లాడుతూ 10.4 బిలియన్‌ డాలర్ల ఆదాయంతో ఉన్నామన్నారు. అదే సమయంలో, పరిశ్రమ వృద్ధి వార్షిక ప్రాతిపదికన 27 శాతంగా ఉంది. ఈ త్రైమాసికంలో విప్రో ఏకీకృత నిర్వహణ ఆదాయం 28 శాతం పెరిగి రూ.20,860 కోట్లకు చేరుకుంది. గతేడాది రూ.16,245.4 కోట్లుగా ఉంది. పూర్తి ఆర్థిక సంవత్సరంలో విప్రో ఏకీకృత నికర లాభం 12.57 శాతం వృద్ధితో రూ. 12,232.9 కోట్లుగా ఉంది. ఇది అంతకుముందు సంవత్సరం 2020-21లో రూ.10,866.2 కోట్లుగా ఉంది.

కంపెనీ నిర్వహణ ఆదాయం 2020-21లో రూ.62,234.4 కోట్ల నుంచి 2021-22లో 28 శాతం పెరిగి రూ.79,747.5 కోట్లకు చేరుకుంది. ఈ కంపెనీలో కూడా అట్రిషన్ సమస్య ఎదుర్కొంటుంది. అట్రిషన్ రేటును తగ్గించడానికి కంపెనీలు అనేక ప్రోత్సాహకాలు కూడా ఇస్తున్నాయి. ఒక నివేదిక ప్రకారం, అధిక అట్రిషన్ రేటు కారణంగా, ఫ్రెషర్‌లకు ఎంట్రీ లెవల్‌లో ఎక్కువ జీతాలు అందిస్తున్నారు. కరోనా మహమ్మారిలో ఐటీ రంగం వ్యాపారం చాలా వేగంగా వృద్ధి చెందింది. అటువంటి పరిస్థితిలో వారికి నైపుణ్యం కలిగిన శక్తి అవసరం. ఆపరేషన్ వర్క్‌ని కొనసాగించగలిగే ఎంట్రీ లెవల్‌లో ఫ్రెషర్‌లకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఐటీ రంగంలో ఫ్రెషర్లకు సగటున 15 శాతం ఎక్కువ జీతం అందిస్తున్నారు.

Read  Also.. RJPL IPO: రిలయన్స్ గ్రూప్ నుంచి రెండు భారీ ఐపీఓలు..! RIL AGM సమావేశంలో వెల్లడించే అవకాశం..!