Wipro hiring 2022: విప్రో బంపర్ ఆఫర్..! కెరీర్ బ్రేక్ తీసుకున్న మహిళా నిపుణులకు ఆహ్వానం పలుకుతోన్న ఐటీ సంస్థ..

|

Jan 28, 2022 | 4:19 PM

రానున్న నాలుగు వారాల పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ కార్యాలయాలను మూసివేయాలని కంపెనీ నిర్ణయించినట్లు విప్రో సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ థియరీ డెలాపోర్టే తాజాగా వెల్లడించారు.

Wipro hiring 2022: విప్రో బంపర్ ఆఫర్..! కెరీర్ బ్రేక్ తీసుకున్న మహిళా నిపుణులకు ఆహ్వానం పలుకుతోన్న ఐటీ సంస్థ..
Wipro
Follow us on

Wipro’s Begin Again program: ప్రముఖ ఐటీ సంస్థ విప్రో (Wipro) తన ‘బిగిన్ ఎగైన్ (Begin Again)’ కార్యక్రమంలో భాగంగా వివిధ రంగాల్లో బ్రేక్ తీసుకున్న మహిళా నిపుణులను (women professionals) నియమించుకోనున్నట్లు ప్రకటించింది. ఆరు నెలల నుండి ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు కెరీర్ విరామం పొందిన మహిళా నిపుణులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలియజేసింది. విప్రో విడుదల చేసిన ప్రకటనలో ఈ విధంగా పేర్కొంది… “బిగిన్ ఎగైన్ అనేది మహిళల కోసం మొదటిసారిగా ప్రత్యేకంగా మేము ప్రారంభించిన ఇంక్లూజన్ అండ్ డైవర్సిటీ (I & D) ప్రోగ్రాం. బ్రేక్ తర్వాత తిరిగి కెరీర్ ప్రారంభించాలని భావిస్తున్న మహిళల కోసం ఉద్దేశించినదే ఈ ప్రోగ్రాం. విశ్రాంతి, మాతృత్వం, వృద్ధుల సంరక్షణ, ప్రయాణం, అభిరుచి.. మరేదైనా వ్యక్తిగత కారణాల రిత్య ఏర్పడిన విరామానికి పుల్‌స్టాప్ పెట్టడానికి ఇది సదావకాశాన్నిస్తుంది. ప్రతిభావంతులైన మహిళలకు కెరీర్ అవకాశాలు అన్వేషించడానికి వీలు కల్పిస్తుంది. తిరిగి ట్రాక్‌లోకి రావడానికి అవకాశం కల్పిస్తుందని ఈ సందర్భంగా తెలియజేసింది. ఎటువంటి ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి, అవసరమైన నైపుణ్యాలు ఏమిటి? అర్హతలేముండాలి? అనే అంశాలను తెలుసుకోవడానికి కూడా వీలునుకల్పిస్తోంది.

Key highlights of the program

  • Structured Learning and Enablement Programs.
  • Integrated framework for a smooth transition.
  • Buddy Program to help you with all your queries.

IT సర్వీసెస్ మేజర్ విప్రో లిమిటెడ్ డిసెంబర్ 2021 త్రైమాసికంలో రూ. 2,969 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. గత సంవత్సరంతో పోలిస్తే కంపెనీ లాభాలు దాదాపు సమాంతరంగానే ఉన్నాయి. ఐతే డిమాండ్ మాత్రం కొనసాగుతూనే ఉంది. ఇక కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో.. రానున్న నాలుగు వారాల పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ కార్యాలయాలను మూసివేయాలని కంపెనీ నిర్ణయించినట్లు విప్రో సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ థియరీ డెలాపోర్టే తాజాగా వెల్లడించారు.

’’కోవిడ్ మహమ్మారి కారణంగా IT కంపెనీలన్నీ ‘వర్క్ ఫ్రమ్ హోమ్’పై ఆధారపడ్డాయి. పూర్తిగా వ్యాక్సిన్ తీసుకున్నఉద్యోగుల్లో కొంత మందితో, హైబ్రిడ్ మోడ్‌లో కంపెనీ నుంచి పనిచేసేందుకు (వర్క్ ఫ్రం ఆఫీస్) గత కొన్ని నెలలుగా ప్రణాళికలు వేస్తోందని, ఎప్పటిలాగే మేము మా కస్టమర్లకు అంకిత భావంతో సేవలందిస్తామని‘‘ ఆయన పేర్కొన్నారు.

Also Read:

PGIMER Jobs: పీజీఐఎమ్ఈఆర్‌లో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్… త్వరలో ముగియనున్న గడువు!