Gas Cylinders: సామాన్యులకు షాక్.. గ్యాస్ సిలిండర్ల ధరలు మళ్లీ పెరిగే ఛాన్స్..!

దేశంలో ఎల్పీజీ గ్యాస్ ధరలు మళ్లీ పెరగనున్నాయా..? అంటే అవుననే సమాధానాలు మళ్లీ వినిపిస్తున్నాయి. కేంద్రంపై సబ్సిడీల భారం పెరిగిపోతుంది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో సబ్సిడీలకు రూ.30 వేల కోట్లు మాత్రమే కేటాయించారు. కానీ రూ.లక్ష కోట్లకు సబ్సిడీలు చేరుకునే అవకాశముంది.

Gas Cylinders: సామాన్యులకు షాక్.. గ్యాస్ సిలిండర్ల ధరలు మళ్లీ పెరిగే ఛాన్స్..!
Lpg Gas Cylinder

Updated on: Jul 20, 2026 | 3:22 PM

త్వరలో సామాన్యులకు మరో షాక్ తగలనుందా..? ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలు మళ్లీ పెరగనున్నాయా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య యుద్దం మళ్లీ మొదలవ్వడం, హర్ముజ్ జలసంధి మూతపడటంతో ఎల్పీజీ గ్యాస్ సరఫరాకు అంతరాయం ఏర్పడే అవకాశముంది. దీంతో గ్యాస్ ధరలు మళ్లీ పెరగవచ్చనే సంకేతాలు వినిపిస్తున్నాయి. యుద్దం ముగిసిపోవడం, ఇటీవల గ్యాస్ సరఫరా పునరుద్దరణ జరగడంతో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను కేంద్రం తగ్గించింది. ఇప్పుడు మళ్లీ యుద్దం మొదలుకావడంతో గ్యాస్ దిగుమతులకు అంతరాయం ఏర్పడే అవకాశముంది. అదే జరిగే గ్యాస్ సిలిండర్ల ధరలు మళ్లీ పెరగవచ్చని చెబుతున్నారు.

ఇక గ్యాస్ సబ్సిడీల భారం 2026-27 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి ఒక పెద్ద సవాలుగా మారవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఎల్పీజీ సబ్సిడీ బిల్లు రూ.1 లక్ష కోట్లకు పైగా ఉంటుందని అంచనా. కేంద్ర బడ్జెట్‌లో సబ్సిడీ కోసం కేవలం రూ.30,000 కోట్లు మాత్రమే కేటాయించారు. అంటే బడ్జెట్ అంచనా కంటే ప్రభుత్వం సుమారుగా రూ.7 వేల కోట్లు అదనంగా కేటాయించాల్సి రావచ్చు. అంతర్జాతీయ ఎల్పీజీ ధరలలో హెచ్చుతగ్గులు, దేశీయ వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు సిలిండర్ ధరలను నియంత్రించే ప్రభుత్వ విధానం కారణంగా సబ్సిడీ భారం క్రమంగా పెరుగుతోంది. ఇక ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులపై దని ప్రభావాన్ని తగ్గించాలని కేంద్రం భావిస్తోంది. దీంతో ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు వాటిల్లిన నష్టాలకు ప్రభుత్వం పరిహారం చెల్లించాల్సి రావచ్చు.

సబ్సిడీలు బడ్జెట్‌లో కేటాయించిన మొత్తాన్ని మించిపోతే.. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం (BPCL), హిందుస్థాన్ పెట్రోలియం (HPCL) వంటి ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు మొదట్లో ప్రభావితం కావచ్చు. అయితే ప్రభుత్వం తర్వాత అదనపు బడ్జెట్ మద్దతు లేదా ఇతర ఆర్థిక ఏర్పాట్ల ద్వారా ఈ కంపెనీలకు ఉపశమనం కల్పించవచ్చు. అంతర్జాతీయ ఎల్పీజీ ధరలు అధికంగానే కొనసాగితే.. ప్రభుత్వంపై ఆర్థిక ఒత్తిడి మరింత పెరగవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద లక్షలాది పేద కుటుంబాలకు రాయితీ ధరలకు ఎల్పీజీ సిలిండర్లను అందిస్తున్నారు. ఈ పథకం పరిధి విస్తరించడం, లబ్ధిదారుల సంఖ్య పెరగడం వల్ల ప్రభుత్వ రాయితీ వ్యయం కూడా పెరుగుతోంది. వినియోగదారులపై అదనపు భారం మోపకుండ రాయితీల ద్వారా ఉపశమనం కల్పించే వ్యూహాన్ని ప్రభుత్వం ప్రస్తుతం అనుసరిస్తోంది.

 

Follow Us