Credit Scores: జీతం తక్కువగా ఉన్నా.. ఉద్యోగం కోల్పోయినా మీ క్రెడిట్‌ స్కోర్‌ తగ్గుతుందా? నిజమెంత?

|

Apr 07, 2024 | 1:24 PM

క్రెడిట్ స్కోర్ అనేది ఒక వ్యక్తి రుణ నిర్వహణ సామర్థ్యానికి సూచిక. ఈ క్రెడిట్‌ స్కోర్‌ను నాలుగు లేదా ఐదు సంస్థలు అందిస్తాయి. ఈ క్రెడిట్ స్కోర్ ఎవరికైనా ఆర్థిక జీవితంలో చాలా ముఖ్యమైనది. క్రెడిట్ స్కోర్ 300 నుండి 900 వరకు ఉంటుంది. 300 కనిష్ట స్కోరు, 900 గరిష్ట స్కోరు. 650 కంటే

Credit Scores: జీతం తక్కువగా ఉన్నా.. ఉద్యోగం కోల్పోయినా మీ క్రెడిట్‌ స్కోర్‌ తగ్గుతుందా? నిజమెంత?
Credit Scores
Follow us on

క్రెడిట్ స్కోర్ అనేది ఒక వ్యక్తి రుణ నిర్వహణ సామర్థ్యానికి సూచిక. ఈ క్రెడిట్‌ స్కోర్‌ను నాలుగు లేదా ఐదు సంస్థలు అందిస్తాయి. ఈ క్రెడిట్ స్కోర్ ఎవరికైనా ఆర్థిక జీవితంలో చాలా ముఖ్యమైనది. క్రెడిట్ స్కోర్ 300 నుండి 900 వరకు ఉంటుంది. 300 కనిష్ట స్కోరు, 900 గరిష్ట స్కోరు. 650 కంటే ఎక్కువ స్కోర్ మంచి క్రెడిట్ స్కోర్. బ్యాంకులు మనకు రుణాలు, క్రెడిట్ కార్డులు ఇవ్వడానికి ఈ స్కోర్ ప్రమాణం. 750 కంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్ రుణం పొందడం సులభం చేస్తుంది. వడ్డీ రేటు కూడా తక్కువగానే ఉంటుంది. మనం తీసుకున్న రుణాన్ని క్రమశిక్షణతో తిరిగి చెల్లించకపోయినా, గడువు తేదీలోగా క్రెడిట్ కార్డ్ బిల్లులు చెల్లించకపోయినా క్రెడిట్ స్కోర్ తగ్గిపోతుంది. ఇదిలావుంటే.. ఉద్యోగం పోయినా, జీతం తక్కువగా వచ్చినా స్కోరు తగ్గుతుందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, క్రెడిట్ స్కోర్‌కు జీతం, ఉపాధితో సంబంధం లేదు.

జీతం కాదు.. ఆర్థిక క్రమశిక్షణ ముఖ్యం
మీ జీతం రూ.15,000 లేదా అంతకంటే తక్కువ అయినా, క్రెడిట్ ఏజెన్సీలకు పట్టింపు లేదు. మీరు రుణ వాయిదాలను క్రమం తప్పకుండా చెల్లించడం ముఖ్యం. క్రెడిట్ కార్డ్ బిల్లును గడువు తేదీలోపు చెల్లించినట్లయితే, క్రెడిట్ స్కోర్ మెరుగుపడుతుంది. రూ.లక్ష జీతం తీసుకుంటున్నా.. డెట్ మేనేజ్ మెంట్ లో క్రమశిక్షణ పాటించకపోతే క్రెడిట్ స్కోర్ దిగజారిపోతుంది.

ఉపాధి, నిరుద్యోగం క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం చూపదు

ఇవి కూడా చదవండి

మీరు సాధారణ జీతంతో ఉద్యోగంలో ఉన్నా, స్వయం ఉపాధిలో ఉన్నా, ఉద్యోగం కోల్పోయిన తర్వాత ఇంట్లోనే ఉన్నా, ఈ కారకాలు ఏవీ మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం చూపవు. అలాగే, మీ బ్యాంకు ఖాతాలో ఎంత డబ్బు ఉంది.. మీరు ఎంత డబ్బు పెట్టుబడి పెట్టారు.. మీకు ఎంత బీమా పాలసీ ఉంది. ఈ అంశాలు కూడా క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం చూపవు. మీరు క్రమం తప్పకుండా చెల్లించే నీటి బిల్లు, విద్యుత్ బిల్లు మొదలైనవి కూడా స్కోర్‌పై ప్రభావం చూపవు. అయితే, బ్యాంకుల నుండి రుణం పొందేటప్పుడు బ్యాంకులు మీ క్రెడిట్ స్కోర్‌తో పాటు మీ పొదుపు, జీతం మొదలైనవాటిని చూసే అవకాశం ఉంది. అంతే కాకుండా, పైన పేర్కొన్న అంశాలు క్రెడిట్ స్కోర్‌పై ఎలాంటి ప్రభావం చూపవు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి