Aadhaar Update: ఆధార్‌ అప్‌డేట్‌ చేస్తే ఆధార్‌ నెంబర్‌ మారుతుందా? అప్‌డేట్‌ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

| Edited By: TV9 Telugu

Sep 05, 2023 | 6:44 PM

ఆధార్‌ ప్రపంచంలోనే అతిపెద్ద బయోమెట్రిక్ గుర్తింపు వ్యవస్థగా నిలుస్తుంది. ప్రభుత్వ సేవలు, ప్రయోజనాలను యాక్సెస్ చేయడం, బ్యాంక్ ఖాతాలను ప్రారంభించడం, మొబైల్ ఫోన్ సిమ్ కార్డ్‌ని పొందడం వంటి అనేక రంగాల్లో తప్పనిసరిగా మారింది. ఆధార్ డేటాబేస్‌ను నిర్వహించడం, ఆధార్ నంబర్‌లను జారీ చేయడం కోసం భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ( యూఐడీఏఐ) బాధ్యత వహిస్తుంది.

Aadhaar Update: ఆధార్‌ అప్‌డేట్‌ చేస్తే ఆధార్‌ నెంబర్‌ మారుతుందా? అప్‌డేట్‌ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
Aadhar1
Follow us on

ప్రస్తుతం భారతదేశంలో ప్రతి చిన్న అవసరానికి ఆధార్‌ అనేది తప్పనిసరిగా మారింది. ఆధార్‌ అంటే వేలిముద్రలు, ఐరిస్ స్కాన్‌లు, పేరు, చిరునామా, లింగం, పుట్టిన తేదీతో సహా ఒక వ్యక్తి బయోమెట్రిక్, డెమోగ్రాఫిక్ డేటాను కలిగి ఉండే 12-అంకెల విలక్షణమైన గుర్తింపు సంఖ్య. ఆధార్‌ ప్రపంచంలోనే అతిపెద్ద బయోమెట్రిక్ గుర్తింపు వ్యవస్థగా నిలుస్తుంది. ప్రభుత్వ సేవలు, ప్రయోజనాలను యాక్సెస్ చేయడం, బ్యాంక్ ఖాతాలను ప్రారంభించడం, మొబైల్ ఫోన్ సిమ్ కార్డ్‌ని పొందడం వంటి అనేక రంగాల్లో తప్పనిసరిగా మారింది. ఆధార్ డేటాబేస్‌ను నిర్వహించడం, ఆధార్ నంబర్‌లను జారీ చేయడం కోసం భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ( యూఐడీఏఐ) బాధ్యత వహిస్తుంది. యూఐడీఏఐ అనేది ఆధార్ ప్రాజెక్ట్‌ను నిర్వహించడానికి ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ క్రింద జనవరి 2009లో స్థాపించారు. 

అప్‌డేట్‌లు ఇలా

మీరు ఆధార్‌లో జనాభా వివరాలను (పేరు, చిరునామా, పుట్టినతేదీ, లింగం, మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడి) అలాగే బయోమెట్రిక్‌లను (వేలిముద్రలు, ఐరిస్ & ఫోటోగ్రాఫ్) అప్‌డేట్ చేయవచ్చు. ఆధార్‌ వివరాలను అప్‌డేట్ చేసుకోవడానికి రెండు విభిన్న మార్గాలు ఉన్నాయి. సమీపంలోని నమోదు కేంద్రాన్ని సందర్శించడం ద్వారా అప్‌డేట్‌ చేసుకోవచ్చు. అలాగే యూఐడీఏఐ వెబ్‌సైట్‌ ద్వారా అప్‌డేట్‌ చేసుకునే అవకాశం ఉంది.  

మొబైల్ నంబర్ లేదా ఈమెయిల్ ఐడీని అప్‌డేట్ చేసిన తర్వాత ఆధార్ కార్డు పోస్ట్‌లో వస్తుందా?

మొబైల్ నంబర్ లేదా ఈమెయిల్ ఐడీని అప్‌డేట్ చేసిన తర్వాత ఆధార్ లెటర్ డెలివరీ చేయరు. మొబైల్ నంబర్ లేదా ఇమెయిల్ ఐడి అప్‌డేట్ కోసం, ఇచ్చిన మొబైల్ నంబర్‌కు నోటిఫికేషన్ పంపుతారు.

ఇవి కూడా చదవండి

అప్‌డేట్ చేసిన తర్వాత మీ ఆధార్ నంబర్ మారుతుందా?

లేదు అప్‌డేట్ చేసిన తర్వాత మీ ఆధార్ నంబర్ ఎల్లప్పుడూ అలాగే ఉంటుంది.

ఆధార్ అంత ముఖ్యమా?

భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సామాజిక సంక్షేమ పథకాలు, కార్యక్రమాలకు నిధులు సమకూరుస్తాయి. ఇవి సమాజంలోని పేద, అత్యంత బలహీన వర్గాలకు సంబంధించినవి. ఆధార్, దాని ప్లాట్‌ఫారమ్ సంక్షేమ పథకాల కింద తమ డెలివరీ మెకానిజంను క్రమబద్ధీకరించడానికి ప్రభుత్వానికి ఒక ప్రత్యేక అవకాశాన్ని అందిస్తాయి. తద్వారా పారదర్శకత మరియు సామర్థ్యాన్ని నిర్ధారిస్తుంది. ఆధార్‌ను గుర్తింపు పత్రంగా ఉపయోగించడం వల్ల లబ్ధిదారులు ఒకరి గుర్తింపును రుజువు చేయడానికి బహుళ పత్రాలను తయారు చేయాల్సిన అవసరాన్ని మినహాయించడం ద్వారా వారి అర్హతలను సౌకర్యవంతంగా చేస్తుంది.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం