Flight: విమానాల్లో Wi-Fi ఎందుకు ఉండదు? ఒకవేళ ఉంటే ఏమవుతుంది?

|

Sep 28, 2024 | 6:51 PM

కొన్ని ఇంటర్నేషనల్ విమానాల్లో ప్రత్యేకమైన శాటిలైట్ వైఫైని అందుబాటులో ఉంచుతారు. దీని సాయంతో కమ్యూనికేషన్లో ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది. అయితే మన దేశంలోని డొమెస్టిక్ విమానాల్లో మాత్రం వైఫై సదుపాయం ఉండదు. ఎందుకు ఇలా ఉంటుంది అని చాలా మంది ప్రశ్నిస్తూ ఉంటారు. ఆ విమానాల్లో ఉన్నది ఇక్కడెందుకు ఉండటం లేదని చాలా మంది ప్రయాణికులు ఆలోచిస్తుంటారు.

Flight: విమానాల్లో Wi-Fi ఎందుకు ఉండదు? ఒకవేళ ఉంటే ఏమవుతుంది?
Wi Fi In Flights
Follow us on

సాధారణంగా విమానం ఎక్కగానే ఫోన్ స్విచ్ఛాఫ్ చేయాలని చెబుతున్నారు. లేదా ఫ్లైట్ మోడ్ లో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక మళ్లీ ఫ్లైట్ దిగే వారు అది ఆ మోడ్లోనే ఉండాల్సి ఉంటుంది. అందుకే కొన్ని ఇంటర్నేషనల్ విమానాల్లో ప్రత్యేకమైన శాటిలైట్ వైఫైని అందుబాటులో ఉంచుతారు. దీని సాయంతో కమ్యూనికేషన్లో ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది. అయితే మన దేశంలోని డొమెస్టిక్ విమానాల్లో మాత్రం వైఫై సదుపాయం ఉండదు. ఎందుకు ఇలా ఉంటుంది అని చాలా మంది ప్రశ్నిస్తూ ఉంటారు. ఆ విమానాల్లో ఉన్నది ఇక్కడెందుకు ఉండటం లేదని చాలా మంది ప్రయాణికులు ఆలోచిస్తుంటారు. ఇది సాధారణంగా విమానయాన సంస్థ, ప్రయాణిస్తున్న విమానం బడ్జెట్ ఆధారంగా ఈ సదుపాయం అందిస్తారని నిపుణులు చెబుతున్నారు.

రెండు రకాలు..

ఎయిర్‌ప్లేన్‌లలో వైఫై సర్వీస్ రెండు రకాలుగా అందిస్తారు. అవి ఎయిర్-టు-గ్రౌండ్, శాటిలైట్ వైఫై. ఎయిర్-టు-గ్రౌండ్ పద్ధతి మీ ఫోన్‌లో నేలపై ఉన్న ఇంటర్నెట్ లాంటిది. ఈ టెక్నాలజీ కింద సెల్ టవర్లు ఆకాశం వైపు వైఫై సిగ్నల్స్ పంపుతాయి. ఈ సిగ్నల్స్ విమానంలో అమర్చబడిన రిసీవర్ చేసి.. విమానంలో వైఫై సేవలను అందిస్తుంది. రెండో పద్ధతి శాటిలైట్ వైఫై. ఈ సాంకేతికతలో, విమానాలకు యాంటెన్నాను అమర్చుతారు. ఇది ఉపగ్రహం నుంచి సంకేతాలను అందుకుంటుంది. ప్రయాణికులకు ఇంటర్నెట్ సేవలను అందిస్తుంది. ఇది కొత్త సాంకేతికత. చాలా విమానయాన సంస్థలు దీనిని వేగంగా అనుసరిస్తున్నాయి. ఈ రెండు పద్ధతుల్లోనూ ప్రయాణికులు ఫ్లైట్ సమయంలో కూడా ఇంటర్నెట్ సౌకర్యాన్ని పొందుతారు. ఇది సుదీర్ఘ ప్రయాణాన్ని కూడా సౌకర్యవంతంగా చేస్తుంది.

అనేక అంతర్జాతీయ విమానయాన సంస్థలు విమానంలో వైఫై సౌకర్యాలను అందిస్తాయి. భారతదేశంలో విస్తారా ఎయిర్ లైన్స్ మాత్రమే ఈ సదుపాయాన్ని కలిగి ఉంది. అంతర్జాతీయ విమానాలలో ఈ సేవ అందిస్తోంది. యునైటెడ్ కింగ్‌డమ్‌కు వెళ్లే విమానాల్లో ఈ సౌకర్యాన్ని ప్రారంభించాలని ఎయిర్ ఇండియా యోచిస్తోంది. దేశీయ విమానాల్లో వైఫై సేవలను ప్రారంభించడంపై ప్రస్తుతం ఎలాంటి సమాచారం లేదు.

విమానాల్లో వైఫై ఎందుకు ఉండదంటే..

ఇండియన్ ఎయిర్‌లైన్స్ వైఫై సేవలను ప్రారంభించకపోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే, ప్రభుత్వం 2018లో దీన్ని నిషేధించింది. అదే సంవత్సరంలో తిరిగి దీనిని అనుమతించింది. అయినప్పటికీ దేశీయ విమానాల్లో వైఫై సౌకర్యం కల్పించలేదు. దీనికి ప్రధాన కారణం ఇప్పుడున్న బడ్జెట్. ఒక నివేదిక ప్రకారం, విమానంలో వైఫైని అందించడానికి మొత్తం సెటప్‌ను సిద్ధం చేయడానికి రూ. 3-4 కోట్లు పడుతుంది. విమానంలో యాంటెన్నాను అమర్చడానికి దాదాపు 12 గంటలు పడుతుంది. ఇది కాకుండా, దేశీయ వినియోగదారులు కంపెనీ భరించే ఖర్చు భారాన్ని భరించడానికి సిద్ధంగా లేరు. విమానయాన సంస్థలు కూడా తమపై ఈ ఖర్చు పెట్టడానికి ఇష్టపడవు. ఎందుకంటే ఈ ఖర్చు కారణంగా తమ కస్టమర్లను కోల్పోతామని వారు భయపడుతున్నారు. విస్తారా ఎయిర్‌లైన్స్ విదేశీ రూట్లలో అందించే వైఫై 20 నిమిషాలు మాత్రమే ఉచితంగా అందిస్తుంది. దీని తర్వాత, ప్రయాణికులు ఇంటర్నెట్ కొనుగోలు చేయాలి. వైఫై ఖర్చును కస్టమర్లు భరించగలిగితే, భారతదేశంలోని దేశీయ విమానయాన సంస్థలు కూడా విమానంలో వైఫై సౌకర్యాన్ని ప్రారంభించే అవకాశం ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..