బాబోయ్.. ఈ బాదం ధర తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..! బెనిఫిట్స్ మాత్రం బోలెడు..

బాదం ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ, బాదంలో ఎన్ని రకాలు ఉన్నాయి..? ప్రపంచంలో ఏ బాదం అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది..? దాని ధర ఎంత ఉంటుందో మీకు తెలుసా? అవును, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బాదం కూడా ఉంటుంది. ఇది రుచికరమైనది మాత్రమే కాదు.. రెట్టింపు ఆరోగ్యకరమైనది కూడా. అంతే ఖరీదైనది. దాని ధరతెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..!

బాబోయ్.. ఈ బాదం ధర తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..! బెనిఫిట్స్ మాత్రం బోలెడు..
Mamra Badam

Updated on: Oct 14, 2025 | 8:33 AM

బాదం పండ్లను డ్రై ఫ్రూట్స్‌లో రారాజు అని పిలుస్తారు. ఇది టేస్ట్‌లో రుచికరంగా ఉండటమే కాకుండా..ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. పోషకాలతో కూడిన బాదంలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్ ఇ, మెగ్నీషియం, ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వాటిని మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరం, మెదడు, చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. కానీ మార్కెట్లో ఎన్ని రకాల బాదంలు అందుబాటులో ఉన్నాయో మీకు తెలుసా…? దీనిలో అత్యంత ఖరీదైనది. పోషకమైనది మమ్రా బాదం. దీని ప్రత్యేకతలేంటో ఇక్కడ చూద్దాం..

మమ్రా బాదం అంటే ఏమిటి?:

మమ్రా బాదం అత్యంత ఖరీదైన, పోషకమైనదిగా పరిగణిస్తారు. ఇవి ప్రధానంగా ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, కాశ్మీర్, భారతదేశంలోని హిమాలయ ప్రాంతాలలో కనిపిస్తాయి. ఈ బాదం అత్యంత విలక్షణమైన లక్షణం ఏమిటంటే వాటిలో రసాయనాలు లేదా పాలిష్‌లు ఉండవు. ఈ బాదం పూర్తిగా సహజమైనవి.

ఇవి కూడా చదవండి

మమ్రా బాదం ఎలా ఉంటుంది?:

మమ్రా బాదం చిన్నగా, కొద్దిగా ముడతలు పడినవిగా ఉంటాయి. కానీ, అవి కాలిఫోర్నియా బాదం కంటే దాదాపు 50శాతం ఎక్కువ పోషకాలను కలిగి ఉంటాయి. వాటిలో ఒమేగా-3 మరియు ఒమేగా-6 వంటి పోషకాలు, అలాగే ప్రోటీన్, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల, శీతాకాలంలో వాటిని తినడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే అవి మంచి శక్తి వనరుగా ఉంటాయి.

మమ్రా బాదం:

కిలోగ్రాముకు రూ. 1,800 నుండి రూ. 3,000 వరకు ఉంటుంది. కాలిఫోర్నియా బాదం కిలోగ్రాముకు రూ.800 నుండి రూ.1,200 వరకు ఉంటుంది. కాశ్మీరీ బాదం కిలోగ్రాముకు రూ.1,200 నుండి రూ.2,000 వరకు ఉంటుంది. కెర్నల్ బాదం కిలోగ్రాముకు రూ.600 నుండి రూ.900 వరకు ఉంటుంది. అదే వీనా మమ్రా గిరి బాదం (Veena Mamra Giri Almonds)ఆన్‌ లైన్‌లో ప్రస్తుతం రూ.20,150 ఉంది. మమ్రా బాదం సాధారణ బాదం కంటే మూడు రెట్లు ఎక్కువ ధర ఉంటుంది. అందుకే వీటిని బాదం రాజు అని కూడా పిలుస్తారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి