Indian Railway: మీరు రైలు ప్రయాణం చేస్తున్నారా..? పొరపాటున ఈ పనులు చేస్తే నేరమే..!

|

Apr 25, 2022 | 12:45 PM

Indian Railway: చాలా మంది రైలు ప్రయాణం చేస్తుంటారు. బస్సు ప్రయాణం కంటే రైలు ప్రయాణాన్ని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఎందుకంటే తక్కువ ఛార్జీ ఉండటం. అలాగే అలసట లేకుండా ప్రయాణం ఉంటుంది. చాలా..

Indian Railway: మీరు రైలు ప్రయాణం చేస్తున్నారా..? పొరపాటున ఈ పనులు చేస్తే నేరమే..!
Follow us on

Indian Railway: చాలా మంది రైలు ప్రయాణం చేస్తుంటారు. బస్సు ప్రయాణం కంటే రైలు ప్రయాణాన్ని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఎందుకంటే తక్కువ ఛార్జీ ఉండటం. అలాగే అలసట లేకుండా ప్రయాణం ఉంటుంది. చాలా మంది ముందుస్తుగా రిజర్వేషన్లు చేసుకుని ప్రయాణిస్తుంటారు. అయితే రైలు ప్రయాణం చేసేటప్పుడు కొన్ని విషయాలను గుర్తించుకోవాలి. పొరపాటున కొన్ని పనులు చేస్తే జరిమానా (Fine) చెల్లించుకోవాల్సి ఉంటుంది. చాలా మందికి ఈ విషయాలు పెద్దగా తెలియకపోవచ్చు. ఇంకా అవసరమైతే జైలు శిక్ష కూడా పడుతుంది. ఈ పనులు ఏమిటో తెలుసుకుందాం.

  1. సాధారణ టికెట్‌ తీసుకుని ఏసీలో ప్రయాణిస్తే..:  కొందరు సాధారణ టికెట్‌ తీసుకుని ఏసీ కోచ్‌లో ప్రయాణిస్తారు. అలా ప్రయాణించినా నేరమే. రైల్వే యాక్టులో సెక్షన్‌ 137 ప్రకారం జరిమానా విధిస్తారు రైల్వే అధికారులు.
  2.  రైలులో పోస్టర్లు అతికించడం: రైలు ప్రయాణం చేసేటప్పుడు మీకు అక్కడక్కడ పోస్టర్లు కనిపిస్తుంటాయి. అలాంటి పోస్టర్లు అతికించడం కూడా తప్పే. రైల్వే యాక్టులో సెక్షన్‌ 166 (B) ప్రకారం.. రూ.500 జరిమానా లేదా ఆరు నెలలో జైలు శిక్ష వేయవచ్చు.
  3. అగ్ని ప్రమాదాలకు కారణమయ్యే వస్తువులను తీసుకెళ్లడం: సాధారణంగా కొందరు రైలు ప్రయాణం చేసేటప్పుడు కొన్ని వస్తువులను వెంట తీసుకెళ్లరాదు. అగ్ని ప్రమాదానికి సంబంధించిన ఏవైనా వస్తువులు తీసుకెళ్లినట్లయితే జరిమానా వేస్తారు. ఉదాహరణకు.. పెట్రోల్‌, డీజిల్, గ్యాస్ సిలిండర్‌ వంటివి. అలాగే రైళ్లలో సిగరెట్‌ కాల్చడం కూడా తప్పే.
  4. టికెట్‌ లేకుండా ప్రయాణం: కొందరు రైలు ప్రయాణం చేసే సమయంలో టికెట్‌ లేకుండా ప్రయాణిస్తారు. టికెట్‌ లేని సమయంలో టీసీ వచ్చి జరిమానా వేసే అవకాశం ఉంది. ఇలా టికెట్‌ లేకుండా ప్రయాణించడం తప్పే. రైల్వే యాక్టులోని సెక్షన్‌ 138 ప్రకారం శిక్ష వేస్తారు.
  5. రైలులో చెత్తవేయడం:  రైలు ప్రయాణం చేసే సమయంలో తోటి ప్రయాణికులకు ఇబ్బందికరమైన పనులు చేయడం తప్పుగా భావించబడుతుంది. అలాగే రైలులో చెత్త వేయడం కూడా నేరమే. రైల్వే చట్టంలోని సెక్షన్‌ 145(B) ప్రయాణం శిక్షార్హం. మొదటిసారిగా తప్పు చేస్తే రూ.100, రెండోసారి తప్పు చేస్తే రూ.250 వరకు జరిమానా విధిస్తారు రైల్వే అధికారులు. లేదంటే నెల రోజుల పాటు జైలు శిక్ష పడే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ ఎక్కువ శాతం శిక్ష విధించకపోయినా జరిమానా మాత్రం విధిస్తారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Aadhaar Card: ఆధార్‌ కార్డులో రకాలు .. ఒక్కో కార్డుకు ఒక్కో ఫీచర్‌.. పూర్తి వివరాలు తెలుసుకోండి

PM Ujjwala Yojana: నిరుపేదలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్ కనెక్షన్లు.. దరఖాస్తు చేసుకోండిలా..