AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Central Government: రైతులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్.. దేశవ్యాప్తంగా అందరికీ ఒకేసారి..

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు గుడ్ న్యూస్ తెలిపింది. పలు పంటలకు మద్దతు ధరల పెంపునకు ఆమోదముద్ర వేసింది. గోధుమలు, పప్పు ధాన్యాల పంట మద్దతు ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇవాళ ఉదయం ప్రధాని మోదీ అధ్యక్షతన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

Central Government: రైతులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్.. దేశవ్యాప్తంగా అందరికీ ఒకేసారి..
Farmers
Venkatrao Lella
|

Updated on: Sep 30, 2026 | 3:54 PM

Share

దేశంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. పంటల మద్దతు ధరల పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు బుధవారం కేంద్ర కేబినెట్ మద్దతు ధర పెంపునకు ఆమోదముద్ర వేసింది. గోధుమలు, పప్పు ధాన్యాలకు మద్దతు ధర పెంచుతున్నట్లు కేంద్రం వెల్లడించింది. గోధుమలకు మద్దతు ధర రూ.2,610కి పెంచగా.. శెనగలకు మద్దతు ధరను రూ.5958కి పెంచారు. మసూర్ పప్పు క్వింటాల్‌కు రూ. 390 పెంచగా.. నూతన కనీస మద్దతు ధర రూ. 7,390గా నిర్ణయించారు. ఇక ఆవాలు రాప్‌సీడ్ క్వింటాల్‌కు రూ. 413 పెంచగా.. నూతన కనీస మద్దతు ధర రూ. 6,613గా ఫిక్స్ చేశారు. ఇక కుసుమకు అత్యధికంగా క్వింటాల్‌కు రూ. 675 పెంచగా.. నూతన కనీస మద్దతు ధర రూ. 7,215గా నిర్దేశించారు. ఇక బార్లీ క్వింటాల్‌కు రూ. 136 పెంచగా.. నూతన కనీస మద్దతు ధర రూ. 2,286గా ఉంది.

పీఎం ధారకు రూ.1,86,405 కోట్లు కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2026-27 ఆర్ధిక సంవత్సరానికి గోధుమల కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2585గా ఉండగా.. 2027-28 సంవత్సరానికి రూ.25 మేర పెంచడంతో రూ.2610కి చేరుకుంది. వ్యవసాయ వ్యయాలు, ధరల కమిషన్ (CACP) సిఫార్సులను పరిగణలోకి తీసుకుని మద్దతు ధరలను పెంచారు.

మద్దతు ధర పెంపుకు కారణాలు..

ఉత్పత్తి వ్యయం, ఎల్‌నివో ప్రభావం, ప్రపంచ, దేశీయ ధరల ధోరణులను పరిగణనలోకి తీసుకుని వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఈపెంపును ప్రతిపాదించగా.. మంత్రివర్గం ఆమోదించింది. బుధవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశం గోధుమలు, పప్పు ధాన్యాల మద్దతు ధరల పెంపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 2026-27 సంవత్సరానికి 121 మిలియన్ టన్నుల గోధుమ ఉత్పత్తి లక్ష్యాన్ని కేంద్రం నిర్దేశించింది. గోధుమ ప్రధాన రబీ సీజన్‌లో శీతాకాలపు పంట. సాధారణంగా అక్టోబర్‌లో విత్తనాలు వేయడం మొదలై ఏప్రిల్‌లో కోత ప్రారంభమవుతుంది. అటు యూపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో 2026-27 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ కోసం కనీస మద్దతు ధర వద్ద రూ.5,547.99 కోట్ల విలువైన కొనుగోళ్లకు ఆమోదం తెలిపింది.  పప్పుధాన్యాలు, నూనెగింజల సాగుదారులను మార్కెట్ ధరల తగ్గుదల నుండి రక్షించి వారికి లాభదాయకమైన రాబడిని అందించడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.  రైతులకు మంచి ధరలు అందటంతో పాటు కొనుగోలు ప్రక్రియలు మరింత పారదర్శకంగా వచ్చేలా కృషి చేయాలని కేబినెట్ నిర్ణయించింది.

యూపీ రూ.3,992.57 కోట్ల విలువైన సేకరణకు అనుమతి పొందగా..ఇందులో రూ.3,937.70 కోట్ల విలువైన 466,000 మెట్రిక్ టన్నుల కందిపప్పుతో పాటు రూ.54.87 కోట్ల విలువైన 6,250 మెట్రిక్ టన్నుల పెసరపప్పు ఉన్నాయి. తెలంగాణ రూ.448.42 కోట్ల విలువైన కొనుగోళ్లకు ఆమోదం లభించగా.. ఇందులో రూ.353.90 కోట్ల విలువైన 62,000 మెట్రిక్ టన్నుల సోయాబీన్, రూ. 94.52 కోట్ల విలువైన 10,766 మెట్రిక్ టన్నుల పెసరపప్పు ఉన్నాయి. మద్దతు ధర పెంచాలని రైతు సంఘాలు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నాయి. పలుమార్లు ఆందోళనలు కూడా చేపట్టాయి. ఇప్పుడు ఎట్టకేలకు కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకుంది. దీంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

Follow Us