వాట్సాప్ పే ద్వారా పేమెంట్ సేవలు అందిస్తోంది. ఇప్పుడు తాజాగా మరో శుభవార్త చెప్పింది. దీనిలో వినియోగదారుల పరిమితిని ఎత్తివేస్తూ ఎన్పీసీఐ ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపింది. ఇప్పటి వరకూ పది కోట్ల మంది వినియోగదారుల వరకూ పరిమితి ఉండేది. సాధారణంగా స్మార్ట్ ఫోన్ లో ఫోన్ పే, గూగుల్ పే యాప్ నుంచి నగదు లావాదేవీలు నిర్వహిస్తూ ఉంటాం. అదే మాదిరిగా వాట్సాప్ నుంచి డబ్బులను పంపించవచ్చు. గతంలో ఈ సేవలు కేవలం పది కోట్ల మందికి మాత్రమే అందుబాటులో ఉండేవి. తాజాగా యూజర్ల అందరూ వినియోగించుకునే అవకాశం కలిగింది. ప్రస్తుతం వాట్సాప్ ను దాదాపు 50 కోట్ల మంది వాడుతున్నారు.
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) తీసుకున్న తాజా నిర్ణయంతో వాట్సాప్ యూజర్లకు మరిన్ని మెరుగైన సేవలు అందనున్నాయి. వాట్సాప్ పే ద్వారా పేమెంట్ సేవలపై గతంలో ఆంక్షలు ఉండేది. 2020లో ప్రారంభ సమయంలో కేవలం ఒక మిలియన్ వినియోగదారులకు మాత్రమే అనుమతి ఉండేది. దాన్ని 2022 నాటికి వంద మిలియన్లకు పెంచారు. తాజాగా అన్ని పరిమితులను తొలగించారు. వాట్సాప్ పే ద్వారా మన కాంటాక్టు జాబితాలోని వ్యక్తులకు డబ్బులను పంపించవచ్చు, వారి నుంచి స్వీకరించవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి