Car Loan: ప్రస్తుతం పాత కార్లకు డిమాండ్ బాగానే ఉంది. కొత్త కార్లను కొనుగోలు చేసే స్థోమత లేనివారు సెకండ్ హ్యాండ్ కార్లపై మొగ్గు చూపుతుంటారు. ఇక 2020 సంవత్సరంలో పాత కార్ల విక్రయాల మార్కెట్ విలువ 27 మిలియన్ డాలర్లుగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. 2026 నాటికి ఇది ఏటా 15 శాతం వృద్ధితో 50 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవల ఓ ప్రముఖ సంస్థ బజాజ్ ఫైనాన్స్ ఈ-కామర్స్ కంపెనీ కార్స్24తో జతకట్టింది. పాత కార్లకు ఫైనాన్స్ ఇచ్చేందుకు రెండింటి మధ్య ఒప్పందం కుదిరింది. అయితే భారత్‌లో ఇప్పటి వరకు పాత కార్లపై రుణాలు తీసుకునే వారి వాటా 15 శాతంగా ఉన్నట్లు తెలుస్తోంది. అధిక శాతం మంది సెకండ్ హ్యాండ్ కార్ల కొనుగోలుకు కూడా రుణాలు విషయం పెద్దగా తెలిసి ఉండదు.
లోన్ తీసుకునే ముందు గుర్తించుకోవాల్సిన విషయాలు:
పాత కార్లపై రుణం తీసుకునే ముందు కొన్ని విషయాలు గుర్తించుకోవడం ముఖ్యం. అర్హత, రుణం, కాలపరిమితి, వడ్డీ రేట్లు, ఈఎంఐ వంటి విషయాలను ముందే తెలుసుకోవడం ఉత్తమం. కార్ల మోడల్, కారు షోరూమ్ నుంచి బయటకు వచ్చిన కారు పనితీరు, తదితర విషయాలు లోన్ మంజూరుపై ప్రభావం చూపుతాయి. బ్యాంకులు గానీ, ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలు గానీ కొత్త కార్లకు ఇచ్చే రుణాల కంటే సెకండ్ హ్యాండ్ కార్లకు ఇచ్చే రుణాలపై వడ్డీ రేటు అధికంగానే ఉంటుంది. కొత్త కార్లకు గ్యారంటీ ఉంటాయి. కానీ పాత కార్లకు ఎలాంటి గ్యారంటి ఉండదు.70-90 శాతం మాత్రమే రుణంగా ఇస్తాయి. అదే కొత్త కార్లకు ఎక్కువ మొత్తంలో రుణం అందిస్తుంటాయి. సాధారణంగా పాత కార్లు కొనే ధర కంటే ఫైనాన్స్ కంపెనీలు ధర తక్కువ కట్టి రుణాలు అందిస్తుంటాయి. అలాగే కాలపరిమితి కూడా తక్కువగానే ఉంటుంది. ఒక వేళ మీరు ఐదేళ్ల కిందటి కారును కొనుగోలు చేస్తే రుణ కాలపరిమితి 3-5 సంవత్సరాలు మాత్రమే ఉండే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
అదే మంచి సంస్థల నుంచి పాత కారును కొనుగోలు చేసినట్లయితే త్వరగా రుణం మంజూరయ్య అవకాశం ఉంటుంది. అదే తెలిసిన వాళ్ల వద్ద నుంచి గానీ, ఇతరుల నుంచి పాత కారు కొనుగోలు చేస్తే రుణం మంజూరు కావడం కొంత కష్టమే. అయితే కొందరు కొన్ని కార్లపై రుణాలు తీసుకుంటారు. అలాంటి కార్ల జోలికి వెళ్లకపోవడం మంచిది. ఎందుకంటే వారు అప్పటికే రుణం తీసుకుంటారు కాబ్టటి దానిపై రుణ వాయిదాలు ఉండవచ్చు. లేదా సరిగ్గా రుణం వాయిదాలను చెల్లించనట్లయి అలాంటి కార్లను ఏ సంస్థలు కూడా రుణం అందించవు.
అసలు పాత కార్లను ఎవరు కొనుగోలు చేయాలి..
ద్విచక్ర వాహనాన్ని వినియోగిస్తూ కారు కొనాలని భావించేవారు పాత కార్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపవచ్చు. వ్యాపారస్తులు రోజువారీ పనుల కోసం కూడా పాత కార్లను కొంటే ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే 5-7 సంతవ్సరాల కాంటే ఎక్కువ కాలం ఉపయోగించుకోవాలని భావించే వాళ్లు పాత కార్ల జోలికి వెళ్లకపోవడం మంచిది. కొత్త కారు కొనుగోలు చేసిన ఏడాదికే దాని విలువ దాదాపు 40 శాతం వరకు తగ్గుతుంది. కార్ల పనితీరు, కారు వాడే విధానం బట్టి ధరల్లో మార్పులు ఉంటాయి. సింగిల్ హ్యాండ్ కారుకు మంచి రేటు వచ్చే అవకాశం ఉంటుంది. అదే కొత్త కారు తీసుకున్న ఏడాది,రెండేళ్లకే కారు రూపు రేఖలు మారితే తక్కువ ధరకు అమ్ముడయ్యే అవకాశం ఉంటుంది.
ఇవి కూడా చదవండి: