నేటి కాలంలో ఆధార్ కార్డు వినియోగం బాగా పెరిగింది. అనేక ప్రభుత్వ పథకాలకు ఆధార్ కార్డును ప్రభుత్వం తప్పనిసరి చేసింది. దీనితో పాటు నేడు భారతదేశంలో ఆధార్ కార్డు ఒక ముఖ్యమైన గుర్తింపు పత్రంగా ఉపయోగంలో ఉంది. ఇప్పుడు ఆధార్ కార్డుకు సంబంధించిన ఒక ముఖ్యమైన అప్‌డేట్ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఆధార్ కార్డుకు సంబంధించిన ఈ పని సెప్టెంబర్ నెలలోనే చేస్తే కొం రుసుము నుంచి రక్షించుకోవచ్చు. అయితే ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిపోయింది. ఏదైనా సర్వీస్ పొందాలనుకుంటే ఇంట్లోనే ఉండి మొబైల్‌లో చేసుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చింది.
యూఐడీఏఐ తరపున ఆధార్ కార్డ్‌లోని పత్రాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకునేందుకు వెలుసుబాటు ఉంది. దీనితో పాటు పత్రాల ద్వారా ప్రజలు సెప్టెంబరు 14, 2023లోపు ఆధార్‌ను ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చని UIDAI తెలిపింది. ఇంతకుముందు ఈ ఉచిత సేవ జూన్ 14, 2023 వరకు మాత్రమే అందుబాటులో ఉండేది. కానీ తరువాత ఇది సెప్టెంబర్ తేదీ వరకు పొడిగించింది యూఐడీఏఐ.
ఉచిత సేవ myAadhaar పోర్టల్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆధార్ కేంద్రాలను సందర్శించడం ద్వారా భౌతికంగా అప్‌డేట్ చేసుకోవచ్చు. ప్రజలు ఆధార్ కేంద్రాలలో అయితే అందుకు కొంత ఛార్జ్ చెల్లించవలసి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో వినియోగదారులు ఆన్‌లైన్ మాధ్యమం ద్వారా సెప్టెంబర్ 14 వరకు ఆధార్ కార్డును ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు.
చివరగా, ఆధార్ అప్‌డేట్ అభ్యర్థన ఆమోదించబడుతుంది. 14 అంకెల అప్‌డేట్ రిక్వెస్ట్ నంబర్ (URN) జనరేట్ చేయబడుతుంది. ఈ ప్రాసెస్ పూర్తయిన తర్వాత మీ ఆధార్‌ను అప్‌డేట్ చేసుకోవచ్చు. లేదా మీ సమీపంలో ఉండే ఆధార్ సెంటర్‌కు గానీ, ఇతర ఆన్‌లైన్ సెంటర్‌కు వెళ్లి కూడా అప్‌డేట్ చేసుకోవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి