
మీ ఫైనాన్సియల్ హిస్టరీని బట్టి కొన్ని క్రెడిట్ ఏజెన్సీలు సిబిల్ స్కోర్ ను అంచనా వేస్తాయి. ఈ స్కోర్ ఎంత ఎక్కువ ఉంటే మీరు ఆర్థికంగా అంత బాధ్యతాయుతంగా ఉన్నారని అర్థం. అందుకే ఎక్కువ స్కోర్ ఉన్నవాళ్లకు త్వరగా లోన్స్ అప్రూవ్ అవుతుంటాయి. అయితే క్రెడిట్ స్కోర్ లో 700 అనేది బెంచ్ మార్క్ వంటిది. మీ స్కోర్ 700 దాటితే మీకు చాలా ప్రయోజనాలు ఉంటాయి. వాటిలో కొన్ని ఇవీ..
సిబిల్ స్కోర్ 700 దాటిన వాళ్లకు తక్కువ వెరిఫికేషన్ ప్రాసెస్ ఉంటుంది. చాలా తక్కువ డాక్యుమెంటేషన్ తోనే లోన్ అప్రూవ్ అవుతుంది. ఒకవేళ స్కోర్ తక్కువ ఉంటే ఎక్కువ పత్రాలు సమర్పించాల్సి వస్తుంది. వెరిఫికేషన్ ప్రాసెస్ కూడా లేట్ అవుతుంది.
సిబిల్ స్కోర్ 700 కంటే ఎక్కువ ఉన్నవారికి కొన్ని బ్యాంకులు తక్కువ వడ్డీకి లోన్ మంజూరు చేసే అవకాశం ఉంది. అయితే స్కోర్ లో ఎలాంటి హెచ్చుతగ్గులు లేకుండా స్థిరంగా 700 పైన మెయింటెయిన్ అవుతుంటే ఈ బెనిఫిట్ ఉంటుంది.
సిబిల్ స్కోర్ 700 దాటిన వాళ్లు లోన్ అమౌంట్ కూడా పెరుగుతుంది. 650 పాయిట్ల ఉన్నవారికంటే రెట్టింపు లోన్ అమౌంట్ ను వీళ్లకు లభిస్తుంది. అలాగే వీళ్లకు ఇప్పటికే ఉన్న లోన్ కి తక్కువ వడ్డీకి రీఫైనాన్స్ ఆప్షన్ కూడా ఉంటుంది.
సిబిల్ స్కోర్ 700 పాయింట్లు మెయింటెయిన్ చేస్తున్నవాళ్లకు బ్యాంకులు ప్రీమియం క్రెడిట్ కార్డులు ఆఫర్ చేస్తుంటాయి. వీటివల్ల రివార్డ్ పాయింట్స్, షాపింగ్ డిస్కౌంట్స్ వంటి అదనపు బెనిఫిట్స్ పొందొచ్చు.
మరిన్ని పర్సనల్ ఫైనాన్స్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి