పండగ సీజన్, ఇతర సమయాల్లో మార్కెట్లు కళకళలాడుతుంటాయి. కంపెనీలు తమ అమ్మకాలను పెంచుకోవడానికి ప్రకటనలు, విక్రయాలకు చాలా ప్రాధాన్యతనిస్తాయి. ఎలక్ట్రానిక్ ఉపకరణాల దుకాణాలు కొత్త ఉత్పత్తులను విక్రయించడానికి ‘push selling’ అనే విక్రయ ప్లాన్‌ను ఉపయోగిస్తాయి. ఈ వ్యూహంలో కస్టమర్‌లకు ప్రస్తుతం వస్తువు అవసరం లేకపోయినా, కొనుగోళ్లు చేసే విధంగా సంస్థలు ప్రోత్సహిస్తుంటాయి. పండుగ సీజన్‌లో మీరు ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్‌ల కోసం మాత్రమే కాకుండా లోన్‌లు, క్రెడిట్ కార్డ్‌లు, ట్రావెల్ ప్యాకేజీలు, వాటి కోసం కూడా కొనుగోళ్లు చేయడానికి ఈ రకమైన ఒత్తిడిని ఎదుర్కొంటారు. అటువంటి ఒత్తిడిని నిరోధించడం చాలా అవసరం. మీకు నిజంగా అవసరమైన వాటిని మీరు కొనుగోలు చేయాలి.
ముందుగా Push Celling ఎలా పని చేస్తుందో అర్థం చేసుకుందాం. పుష్ సెల్లింగ్‌లో కంపెనీలు మీకు అవసరమైన వాటిని విక్రయించవు. వారు విక్రయించాలనుకుంటున్న వాటిని మాత్రమే అమ్ముతారు. వారు ఉత్పత్తి ఫీచర్స్‌ను హైలెట్ చేస్తారు. ఉత్పత్తులను మరింత ఆకర్షణీయంగా చేయడానికి డిస్కౌంట్లు, కూపన్ కోడ్‌లు, చౌక రుణ ఆఫర్‌లను అందిస్తారు. పుష్ సేల్ అనేది కంపెనీలు.. ఏజెంట్లు, రిటైలర్‌లు, ఇ-కామర్స్ పోర్టల్స్ తో కలిసి పనిచేసే ప్రచార వ్యూహం. అప్పుడు ఈ కంపెనీలు అటువంటి ఉత్పత్తులను విక్రయించడానికి ప్రోత్సాహకాలను అందిస్తాయి. ఎలాంటి ప్రకటనలు లేకుండా ఉత్పత్తులను విక్రయిస్తారు. కానీ, కొన్నిసార్లు, అటువంటి ఉత్పత్తుల నాణ్యత లేదా లక్షణాలు ఎలా ఉన్నాయో మాత్రం చెప్పరు.
వినియోగదారు పాలసీ నిపుణుడు బెజోన్ మిశ్రా చెప్పేది ఒక్కటే.. పుష్ విక్రయం అన్యాయమైన వాణిజ్య పద్ధతి. ఇది వినియోగదారుల రక్షణ చట్టం 2019లో బాగా అమలు చేశారు. ఇది ప్రజలను తప్పుదారి పట్టించి, కొనుగోలు చేసేలా వారిని బలవంతం చేస్తుంది. గరిష్ఠ రిటైల్ ధర లేదా ఉన్నదాని కంటే ధరను పెంచుతూ అమ్మకాలు సాగిస్తారు.
పుష్ అమ్మకం అనేది మంచి విక్రయ ప్లాన్. చాలా కంపెనీలు తమ ఉత్పత్తులను విక్రయించడానికి దీన్ని ఉపయోగిస్తాయి. అయితే, కంపెనీలు తమకు అవసరం లేని ఉత్పత్తులను కొనుగోలు చేయాలని వినియోగదారులపై ఒత్తిడి తెచ్చినప్పుడు సమస్య తలెత్తుతుంది. మీరు అలాంటి వస్తువులను కొనుగోలు చేస్తే, మీరు ఆశించిన ప్రయోజనాలను పొందుతారని చెప్పలేం. ఒక వేళ ప్రభుత్వ పోర్టల్స్‌లో ఫిర్యాదు చేసినా సరైన రిజల్ట్ ఉంటుందని చెప్పలేం. విక్రయించడం కంపెనీ పని. దాని పని అది చేస్తుంది. కానీ మీరు సేల్స్ పిచ్‌లో కొనాల్సిన అవసరం లేదు కదా. టెలిమార్కెటింగ్ కాల్స్, ఇ-కామర్స్ సైట్‌లలో తప్పుదారి పట్టించే ప్రకటనలు, బై వన్ గెట్ వన్ వంటి ఆఫర్‌ల ప్రలోభాల పట్ల జాగ్రత్తగా ఉండండి. కొనుగోలు చేయాలా వద్దా అనేది మీరు పూర్తిగా ఆలోచించుకోవాల్సి ఉంటుంది.
ఎక్కడ ఫిర్యాదు చేయాలి?
వ్యక్తులు వీలైనంత వరకు పుష్ సెల్లింగ్ కేసుల గురించి ఫిర్యాదు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. మీరు నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్ 1800-11-4000 లేదా 1915కి కాల్ చేయడం ద్వారా ఫిర్యాదును ఫైల్ చేయవచ్చు. మీరు కొన్న ఉత్పత్తి వివరాలను అందించండి. కొనుగోలు చేసేందుకు మీపై ఏదైనా ఒత్తిడి తీసుకువచ్చినా ఫిర్యాదులో పేర్కొనవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి