ప్రతి రోజు చాలా మంది బ్యాంకుకు వెళ్లి లావాదేవీలు జరుపుతుంటారు. రకరకాల అవసరాల నిమిత్తం బ్యాంకులకు వెళ్లి విత్‌డ్రా వంటివి చేస్తుంటారు. చిన్న మొత్తం అయితే ఏటీఎం నుంచి తీసుకోవచ్చు గానీ, పెద్ద అమౌంట్ ఉన్నవారు బ్యాంకులకు వెళ్తుంటారు. అయితే బ్యాంకులు డబ్బులు విత్ డ్రా చేసుకున్న తర్వాత మొత్తాన్ని లెక్కించుకోవడం ఉత్తమం. ఎందుకంటే అందులో ఎక్కువ వచ్చినా.. తక్కువ వచ్చినా తర్వాత ఇబ్బందులు ఎదుర్కొవచ్చు.
మీరు బ్యాంకులో డబ్బులు విత్ డ్రా చేసిన తర్వాత నగదు తీసుకోవడానికి వెళ్లిన తర్వాత పొరపాటున క్యాషియర్ మీకు మరింత డబ్బు అందజేసినట్లు మీకు ఎప్పుడైనా జరిగిందా..? అవును అయితే డబ్బును తిరిగి ఇవ్వడం మీ కర్తవ్యం. కానీ మీరు కూడా పొరపాటున ఆ మొత్తాన్ని లెక్కించకుండా, అంతకు మించి వేరే చోటికి బదిలీ లేదా చెల్లించినట్లయితే, మీరు ఆ మొత్తాన్ని బ్యాంకుకు తిరిగి ఇవ్వవలసి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో బ్యాంకుకు ఎలాంటి చట్టపరమైన హక్కులు ఉన్నాయో తెలుసుకుందాం..?
బ్యాంకుకు మీకు క్యాషీయర్ పొరపాటున మీరు చేసిన విత్‌డ్రా కంటే ఎక్కువ డబ్బుల ఇచ్చినట్లయితే మీ నుంచి డబ్బును విత్‌డ్రా చేసుకునేందుకు బ్యాంకుకు పూర్తి హక్కు ఉంది. మీరు అదనపు డబ్బు మొత్తాన్ని బ్యాంకుకు తిరిగి ఇవ్వడం మంచిదని గుర్తించుకోండి. మీకు బ్యాంకు నుంచి ఎక్కువ వచ్చిన డబ్బును తిరిగి ఇవ్వకుంటే మీపై కేసు నమోదు అయ్యే అవకాశం ఉంది. బ్యాంక్ మీపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయవచ్చు. మీరు దీన్ని నివారించాలనుకుంటే, మీ వద్ద ఉన్న పరిష్కారాలు ఏమిటిటో తెలుసుకుందాం.
ఇలాంటి పరిస్థితి మీకు ఎదురైతే బ్యాంకు ఎలాంటి చర్యలు తీసుకోవచ్చునో తెలుసుకుందాం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి