Gold Prices Today: బంగారం కొనుగోలుచేసేవారికి గుడ్ న్యూస్.. ఇవాళ తగ్గిన రేట్లు.. తులం ఎంతంటే..?

బంగారం ధరలు గత కొద్దిరోజులుగా పెరుగుతూ వస్తోన్న విషయం తెలిసిందే. నిన్న వెండి ధరలు భారీగా పెరగ్గా.. ఇవాళ కాస్త శాంతించాయి. నిన్న రెండు లక్షలకు వెండి ధరలు చేరుకున్నాయి.. ఇవాళ వివిధ నగరాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో చూడండి.

Gold Prices Today: బంగారం కొనుగోలుచేసేవారికి గుడ్ న్యూస్.. ఇవాళ తగ్గిన రేట్లు.. తులం ఎంతంటే..?
Gold Price

Updated on: Dec 05, 2025 | 6:35 AM

Silver Rates Today: బంగారం ధరలు మళ్లీ తగ్గాయి. గురువారం పెరిగిన బంగారం ధరలు.. ఇవాళ మళ్లీ తగ్గుముఖం పట్టాయి. గత కొద్దిరోజులుగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. ఒకరోజు తగ్గితే.. మరొక రోజు పెరుగుతున్నాయి. దీంతో గోల్డ్ రేట్లు ఎప్పుడు పెరుగుతాయో.. ఎప్పుడు తగ్గుతాయో అర్థం కావడం లేదు. గురువారం ఒక్కసారిగా వెండి ధర రెండు లక్షల మార్క్‌కు చేరుకుని ఆల్ టైం రికార్డ్‌గా నిలిచింది. ఇవాళ బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

బంగారం ధరలు

-హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర బంగారం 1,29,650 వద్ద కొనసాగుతోంది. గురువారం రూ.1,29,660గా ఉంది. నిన్నటితో పోలిస్తే ఇవాళ రూ.10 తగ్గింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,18,840 వద్ద కొనసాగుతోంది. గురువారం రూ.1,18,850 వద్ద ఉంది.

-విజయవాడలో 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.1,29,650గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,18,840 వద్ద కొనసాగుతోంది.

-చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,31,120 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,20,190గా ఉంది.

-బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,29,650 వద్ద కొనసాగుతుండగా..22 క్యారెట్ల ధర రూ.1,18,840గా ఉంది.

-ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,29,800 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,18,990 వద్ద ఉంది.

 

వెండి ధరలు ఇలా..

-హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.1,99,900గా ఉంది. నిన్న ఈ ధర రూ.2,00,000గా ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.100 తగ్గింది.

-చెన్నైలో కేజీ వెండి రూ.1,99,900 వద్ద కొనసాగుతోంది

-బెంగళూరులో కేజీ వెండి ధర రూ.1,90,990గా ఉంది

-ఢిల్లీలో కేజీ వెండి రూ.1,90,900గా ఉంది

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి