ముంబై ప్రధాన కేంద్రంగా ఇనుము, ఉక్కు, అల్యూమినియం, గ్రానైట్, ఇతర అల్లాయ్ ఉత్పత్తులను తయారు చేసే ఏఏ ప్లస్ ట్రేడ్ లింక్ కంపెనీ కూడా వీటిని ప్రకటించింది. దీనిపై త్వరలో జరిగే బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకోవనున్నారు. ఏఏ ప్లస్ ట్రేడింగ్ లింక్ కంపెనీ షేర్లు ఇటీవల 5 శాతం లోయర్ సర్క్యూట్ ను తాకాయి. ఒక్కో షేర్ ధర రూ.19.60 వద్ద నిలిచింది. అంతకు ముందు రోజు ముగింపు సమయంలో రూ.20.63 గా నమోదైంది. ఈ కంపెనీ అక్టోబర్ 11 నాటికి రూ.47.68 కోట్ల ఎం క్యాప్ తో మైక్రో క్యాప్ గా నిలిచింది. స్టాక్ కు సంబంధించిన 52 వారాల లెక్కల ప్రకారం.. ఒక్కొక్కటి గరిష్టంగా రూ.26.88, కనిష్టంగా రూ.7.01గా కొనసాగాయి.
బోనస్ ఇష్యూ, స్టాక్ స్ల్పిట్ ప్రతిపాదనలను పరిశీలించడానికి అక్టోబర్ 24న ఏఏ ట్రేడింగ్ లింక్ కంపెనీ బోర్డు ప్రతినిధులు సమావేశం కానున్నారు. దానిలో తీసుకున్న నిర్ణయం ప్రకారం తదుపరి చర్యలు ఉంటాయి. ఒక షేర్ ను పది షేర్లుగా విభజించాలని భావిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. పెట్టుబడి దారులకు ఒక్క షేర్ కు మరొకటి ఇవ్వనున్నారు. అలాగే బోనస్ ఇష్యూను కూడా పరిశీలిస్తారు. కంపెనీలు తమ వ్యాపార వ్యవహారాలలో భాగంగా అనేక చర్యలు తీసుకుంటాయి. వివిధ ప్రణాళికలు రూపొందిస్తాయి. వాటిలో స్టాక్ స్ల్పిట్ ఒకటి. పెట్టుబడిదారులను ఆకట్టుకోవడానికి, అలాగే స్టాక్ ధర ఆకర్షణీయంగా ఉండటానికి ఇలాంటి చర్యలు తీసుకుంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఒక కంపెనీకి సంబంధించి ప్రస్తుతం ఉన్నషేర్లను విభజించి ఎక్కువ చేయడాన్ని స్టాక్ స్ల్పిట్ అంటారు. దీని వల్ల షేర్ ధర తక్కువగా మారుతుంది. మరింత మంది కొనుగోలు చేయడానికి వీలు కలుగుతుంది.
ధర తగ్గడం వల్ల ట్రేడింగ్ పెరుగుతుంది. అలాగే షేర్ హోల్డర్లకు అదనపు షేర్లు కేటాయిస్తారు కాబట్టి వారికి ఎటువంటి నష్టం కలుగదు. బోనస్ ఇష్యూ అంటే ఆ కంపెనీకి చెందిన వాటాదారులకు అదనపు షేర్లు కేటాయించడం. డివిడెంట్ చెల్లింపును పెంచడానికి బదులుగా ఇలా అదనపు షేర్లను కేటాయిస్తారు. బోనస్ గా ఎన్ని షేర్లు కేటాయిస్తారనే విషయం ఆ కంపెనీ తీసుకున్న నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు రెండు షేర్లు ఉన్నవారికి ఒకటి కేటాయించవచ్చు. కంపెనీలు లాభాల్లో ఉన్నప్పటికీ వాటాదారులకు డివిడెంట్లు చెల్లించేందుకు నిధులు ఉండకపోవచ్చు. అలాంటి సమయంలో బోనస్ ఇష్యూను ప్రకటిస్తారు. డివిడెండ్ కు బదులు అదనపు షేర్లు ఇవ్వడం వల్ల ఇన్వెస్టర్ కు లాభదాయకంగా ఉంటుంది. వీటివల్ల దీర్ఘకాలంలో ప్రయోజనాలు కలుగుతాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..